Begin typing your search above and press return to search.
ఈ పురుగు భలే కాస్ట్లీ గురూ.. మీకు దొరికితే ఇక లక్షలే..!
By: Tupaki Desk | 6 March 2022 5:00 AM ISTఈ భూమి మీద ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇంకా కొన్ని మానవులకు మంచి చేసేవి ఉంటాయి. ఇక రైతు నేస్తాలైన పురుగులు కూడా ఉంటాయి. వీటితో పాటు అరుదైన జాతులు ఉంటాయి. అయితే అవి పేరుకు కీటకాలే అయినా కూడా చాలా ప్రియం. వాటి ధర లక్షల్లో ఉంటుంది.
పురుగులకు లక్షల ధర ఏంటి అనుకుంటున్నారా...! ఈ పురుగులు కొంచెం కాస్ట్లీ. అందుకే వీటిని పట్టుకొని విక్రయిస్తే... ఇక లక్షాధికారి కావొచ్చు. మరి ఇవి ఏం పురుగులు..? ఎక్కడ ఉంటాయి? వాటిని ఎలా పట్టుకోవాలో? తెలుసుకుందామా..!
లక్షల రూపాయలు విలువచేసే పురుగు స్టాగ్ బీటిల్. ఇది సహజంగా రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఉంటుంది. ఈ కీటకం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ జాతిలో 1200 రకాల ప్రజాతులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పురుగుల ఫ్యామిలీని ల్యూకనాయిడ్ అని పిలుస్తారు. దీనిని నాలుగు భాగాలుగా విభజించారు. అయితే వీటిలో కామన్ గా కొమ్ములు కలిగి ఉంటాయి. స్టాగ్ బీటిల్ అన్ని ప్రాంతాల్లో నివసించదు. దీనికి ప్రత్యేకమైన వాతావరణం కావాలి. ఎక్కువ చలి ఉంటే ఇవి చచ్చిపోతాయి. ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే ఇవి బతుకుతాయి.
స్టాగ్ బీటిల్ కు రెండు పొడవాటి కొమ్ములు ఉంటాయి. నలుపు రంగులో ఉండే ఈ కొమ్ములు తలపై నుంచి పొడుచుకుని వచ్చినట్లుగా ఉంటాయి. ఈ కొమ్ముల ద్వారా వీటిని సులభంగా గుర్తించవచ్చు. వీటిలో ఉండే పెద్ద పురుగులు ఆహారం తీసుకోవు. తియ్యని ద్రవాన్ని సేవిస్తాయి. చెట్లలో ఉండే నీరు, లేత కలప లోని ద్రవం, పాడైన పండ్లలో ఉండే ద్రవాన్ని మాత్రమే స్వీకరిస్తాయి.
పాడైన కలప ఉండే ప్రదేశాల్లోనూ ఈ పురుగులు కనిపిస్తాయి. ఆ కలపపై లార్వా ఉంచి... సంతానోత్పత్తి చేసుకుంటాయి. పొడవైన కొమ్ములతో చెట్ల బెరడును సైతం తొలిచివేస్తాయి. వీటి కొమ్ములతో భవనాలకు నిప్పు పెట్టగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
ఈ పురుగులు ఉన్న ప్రాంతంలో పిడుగు పడదనే ప్రచారం కూడా ఉంది. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఇక వీటి జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని వారాలపాటే ఇవి బతుకుతాయి. ఈ పురుగులను ముట్టుకుంటే వాటి ముందున్న కొమ్ముల వంటివి గుచ్చుకుంటాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పల్లెలో ఇవి కనిపిస్తే... మ్యూజియానికి తరలించవచ్చు. వీటిని అమ్మితే లక్షల రూపాయలు పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జపాన్ ఈ పురుగులు పెంచే ఆయన.. ఓ పురుగును ఏకంగా రూ.65 లక్షలకు విక్రయించారట.!