Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా!

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:30 PM GMT
ప్రపంచంలో అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా!
X
ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసకాండను సృష్టిస్తోంది. ఆ దేశంపై భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా తాజాగా రష్యన్ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కీవ్ సరిహద్దుల్లో మోహరించి ఉన్న రష్యా సైన్యాలు .

తాజాగా హోస్టోమెల్ విమానాశ్రయంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో అక్కడే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్ 225 ‘మ్రియా’ ధ్వసమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మ్రియా అంటే ఉక్రెయిన్ భాషలో కల అని అర్థం. దీన్ని మళ్లీ పునర్ నిర్మిస్తానని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా వెల్లడించారు. స్వేచ్ఛాయుత, బలమైన ప్రజాస్వామ్య ఐరోపా దేశంగా ఉక్రెయిన్ ను నెలకొల్పాలన్న తమ కలను నిజం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ‘మ్రియా విమానాన్ని కూల్చగలిగారు కానీ.. మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఈ విమానాన్ని ఉక్రెయిన్ కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ‘ఆంటొనొవ్’ తయారు చేసింది. రష్యా దాడిపై స్పందిస్తూ ప్రస్తుతం ఏన్ 225 పరిస్థితి ఏ దశలో ఉందో వివరించలేమని తెలిపింది. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాతే దాని కండీషన్ ను చెప్పగలమని తెలిపింది.

కీవ్ నగరంలోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు గానూ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో గూగుల్ మ్యాప్స్ లో ఉండే కొన్ని కీలక సాధనాలను డీయాక్టివేట్ చేసింది. వివిధ ప్రాంతాల రూట్ మ్యాప్ , రద్దీ సమాచారం.. ఆయా ప్రాంతాల సమాచారాన్ని తెలియకుండా చేసింది. తద్వారా రష్యాసేనల దాడుల నుంచి స్థానిక ప్రజలకు భద్రత లభిస్తుందిన పేర్కొంది.

ఇక రోడ్లపై ప్రాంతాలు,నగరాలు, గల్లీలకు వెళ్లే గుర్తుల సూచికలను సైతం స్థానిక సంస్థలు తొలగించాయి. తద్వారా రష్యన్ బలగాలకు ఎటు వెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.