Begin typing your search above and press return to search.

అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు వేళ జగన్ సర్కార్ ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   3 March 2022 8:33 AM GMT
అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు వేళ జగన్ సర్కార్ ఏం చేస్తుంది?
X
ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై ఈ రోజు (గురువారం) ఏపీ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించటం తెలిసిందే. ఈ తీర్పు సారాంశం మొత్తాన్ని ఒక్క లైనులో చెప్పాలంటే.. మూడు రాజధానులు కుదరదు.. ఏపీ రాజధాని అమరావతే.. భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటూ స్పష్టంగా తన తీర్పును చెప్పేసింది. దీంతో పాటు.. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ.. దాని ప్రాధికార సంస్థగా సీఆర్డీఏను ఏర్పాటు చేయటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సీఆర్డీఏను రద్దు చేయటం తెలిసిందే.

తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినప్పుడు.. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే వీల్లేదని.. దాన్ని మార్చటం కుదరదని స్పష్టం చేసింది. దీంతో.. మూడు రాజధానులను తీసుకురావాలని తపిస్తున్న జగన్ సర్కారుకు షాకిచ్చేలా హైకోర్టు ధర్మాసనం తీర్పు ఉందన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి సమయంలో జగన్ సర్కారు ఇప్పుడేం చేయనుంది? దానికున్న దారేంటి? అమరావతిని రాజధానిగా ఒప్పుకోవటానికి జగన్ ప్రభుత్వానికి సుతారం ఇష్టం లేదని చెబుతారు. అలాంటిది ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయటంతో పాటు.. ఆర్నెల్ల లోపు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను ఫుల్ గా డెవలప్ చేసి ఇవ్వాలన్న మార్గదర్శకాన్ని విడుదల చేసింది.

తాజాగా వెలువరించిన తీర్పుతో అమరావతిని రాజధానిగా మార్చటానికి సాధ్యం కానట్లే.అంతేకాదు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడురాజధానులను కూడా తప్పు పట్టేసింది. గతంలో తీసుకొచ్చిన సీఆర్డీఏనే ఫైనల్ అని తేల్చింది. ఈ నేపథ్యంలో రాజధానిని మార్చటం కుదరకపోగా.. తమకు ఏ మాత్రం ఇష్టం లేని.. అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ.. హైకోర్టు చెప్పినట్లుగా పనులు చేయాల్సి ఉంటుంది.

తమ వాదనకు పూర్తి భిన్నంగా ఉండేలా హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో తమ కర్తవ్యం ఏమిటన్నది ఇప్పుడు వైసీపీ సర్కారుకు అర్థం కానిదిగా మారిందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ సర్కారుకు ఉన్న ఏకైక మార్గం.. అయితే హైకోర్టు తీర్పును యథాతధంగా అమలు చేయటం.. లేదంటే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకుఅవకాశం ఉంది.

అయితే.. ఇదంతా కూడా కాలహరణానికి తప్పించి.. చివరకు అమరావతిని అంగీకరించక తప్పని పరిస్థితే అవుతుంది. అయితే.. తమ స్టాండ్ కు ఏ మాత్రం సంబంధం లేని అంశాల్ని డెవలప్ చేసే కన్నా.. చూస్తుండిపోవటానికి అవకాశం కలుగుతుంది. సో.. ఇప్పటికిప్పుడు హైకోర్టు వెలువరించిన తీర్పును అమలు కంటే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించటానికే జగన్ సర్కారు మొగ్గు చూపుతారన్న మాట వినిపిస్తోంది.