Begin typing your search above and press return to search.

అంతకంతకూ విస్తరిస్తున్న ఒమిక్రాన్... మూడో డోసుపై తర్జనభర్జనలో కేంద్రం.!

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:12 AM GMT
అంతకంతకూ విస్తరిస్తున్న ఒమిక్రాన్... మూడో డోసుపై తర్జనభర్జనలో కేంద్రం.!
X
కరోనా మహమ్మారి రోజురోజుకు రూపాంతరం చెందుతుంది. ఒకటి తరువాత మరొకటి వేరియనట్లు పుట్టుకు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తాజాగా దక్షిణాఫ్రికా లో వెలుగు చూసిన కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్... ప్రపంచం మొత్తనికి కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. వైరస్ ను అరికట్టే దిశగా ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేశాయి. ఇదిలా ఉంటే భారత్ లాంటి పెద్ద దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బూస్టర్ డోసు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ ఢిల్లీ వేదికగా సమావేశమైంది. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమం తో పాటు పిల్లలకు ఇచ్చే టీకాపై కూడా ఇందులోని నిపుణులు చర్చించినారు.

భారత్ లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 27 కు చేరింది దీంతో వివిధ రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు ఈ నేపథ్యంలో సమావేశమైన కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. దేశంలోని ప్రజలకు మూడో డోసు ఇచ్చే దానిపై చర్చించారు అయితే నిపుణుల మధ్య ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి నిపుణుల బృందం భేటీ అయ్యి మూడో డోసు టీకపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రోజురోజుకు కరోనా నుంచి కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో... పిల్లలకు కూడా కరోనా టీకాను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మంగళవారం జరిగిన సమావేశంలో దీనిపై కూడా నిపుణులు చర్చించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పిల్లలకు ఎప్పటి నుంచి టీకాలు ఇవ్వాలి అనే దానిపై పూర్తిస్థాయిలో ఓ నిర్ణయానికి రాలేక పోయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి మూడో డోసు ఇవ్వాలనే ప్రతిపాదన పై నిపుణులు ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోంది.

తాజాగా వెలుగు చూస్తున్న కొత్త వేరియంట్ కేసులను అడ్డుకునేందుకు బూస్టర్ డోస్ అవసరం కచ్చితంగా ఉంటుందని దేశవ్యాప్తంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడో డోసు టీకాను ఇచ్చే ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. దీంతో ఈ సమావేశంలో నిపుణులు ప్రముఖంగా దానిపై చర్చించినట్లు సమాచారం.