Begin typing your search above and press return to search.

మండిపోతున్న విదేశీ బొగ్గు

By:  Tupaki Desk   |   28 March 2022 7:19 AM GMT
మండిపోతున్న విదేశీ బొగ్గు
X
విదేశీ బొగ్గు ధరలు మండిపోతోంది. విదేశాలనుండి బొగ్గును సరఫరా చేసేందుకు టెండర్లలో పాల్గొని బిడ్లు దాఖలు చేసిన ఏకైక సంస్థ అదానీ టన్నుకు రు. 40 వేలు కోట్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. టెండర్లలో మరో సంస్ధేదీ పాల్గొనకపోవటం, అదానీ సంస్థ కోట్ చేసిన ధర చాలా ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు ఆ టెండర్ ను క్యాన్సిల్ చేసేశారు. టెండర్ల ప్రక్రియ రద్దయ్యింది కాబట్టి కొద్దిరోజుల్లో మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లను ఆహ్వానించాలని డిసైడ్ చేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే మన రాష్ట్ర అవసరాలకు ప్రతిరోజు థర్మల్ కేంద్రాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయటానికి 5 లక్షల టన్నుల బొగ్గు అవసరం.

దేశీయంగా అంత పెద్ద ఎత్తున బొగ్గు దొరకటం లేదు. అందుకనే విదేశాల నుండి బొగ్గు కొనుగోలు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో రోజుకు పది లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది.

దాదాపు ఐదు నెలల క్రితం ఆహ్వానించిన టెండర్లలో అదానీ, అగర్వాల్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. అందులో అదానీ సంస్థ టన్నుకు రు. 19500కి కోట్ చేసింది. అయితే రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఈ మొత్తాన్ని రు. 17600 కు సరఫరా చేసేందుకు అంగీకరించింది.

అయితే ఆ ధర కూడా చాలా ఎక్కువని ప్రభుత్వం భావించి టెండరును రద్దు చేసింది. ఐదు నెలల క్రితం టన్ను బొగ్గు ధర రు. 17600 చాలా ఎక్కువని అనుకుంటే ఇపుడు ఏకంగా రు. 40 వేలు కోట్ చేయటం ఆశ్చర్యంగా ఉంది.

ఇంత భారీ ఎత్తున టన్నుధర పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఉక్రెయిన్-రష్యా యుద్ధమే అని అదానీ సంస్ధ చెబుతోంది. ప్రస్తుత వేసవిలో విద్యుత్ వాడకం విపరీతంగా పెరగబోతోంది. దీనికి రోజుకు లక్షల టన్నుల బొగ్గు అవసరం. ఆమధ్య వరకు సింగరేణి, మహానది నుండి వచ్చిన బొగ్గును అన్నీ ఛార్జీలు కలుపుకుని టన్నుకు రు. 3600 మాత్రమే చెల్లించింది. కానీ ఇపుడు పై సంస్ధల నుండి సరఫరా తగ్గిపోయింది. అందుకనే విదేశీబొగ్గు కొనటం అవసరమైంది. మరి చివరకు ప్రభుత్వం ఏమి చేస్తుంది చూడాలి.