Begin typing your search above and press return to search.

పుట్టబోయే బిడ్డ ఆడా? మగ? అన్నది వారిపై ఆధారపడి ఉంటుందట !

By:  Tupaki Desk   |   16 Nov 2021 11:30 AM GMT
పుట్టబోయే బిడ్డ ఆడా? మగ? అన్నది వారిపై ఆధారపడి ఉంటుందట !
X
న్యూక్యాసల్‌ వర్సిటీ అధ్యయనం తాజాగా విషయాలని వెలుగులోకి తీసుకువచ్చింది. పుట్టబోయే బిడ్డ ఆడా, మగ అన్నది తండ్రి తోబుట్టువులపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. దాదాపు వెయ్యి కుటుంబాల వివరాలను విశ్లేషించిన తరువాత తామీ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కోరి గెలాట్లీ చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రకారం తండ్రికి అన్నదమ్ములు ఎక్కువగా ఉంటే మగ సం తానం కలిగేందుకు, అక్కచెల్లెళ్లు ఎక్కువగా ఉంటే ఆడపిల్ల పుట్టే అవకాశం ఎక్కువగా ఉందట. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 1600 సంవత్సరం నుంచి అమె రికా, యూరప్‌లలో కొనసాగుతున్న 927 కుటుం బాలకు చెందిన 5.56 లక్షల మందిని పరిగణనలోకి తీసుకున్నారు.

వారి వంశవృక్షాన్ని పరిశీలించినప్పు డు అన్నదమ్ములు ఎక్కువగా ఉన్న వారికి పురుష సంతానం, అక్కచెల్లెళ్లు ఎక్కువగా ఉన్నవారికి ఆడ పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి సులు వుగా అంచనా వేయలేమని అధ్యయనం తెలిపింది. పురుషుల వీర్యంలోని క్రోమోజోమ్‌ ఎక్స్‌ మహిళ ల్లోని ఎక్స్‌ క్రోమోజోమ్‌ తో జతకడితే అమ్మాయి ఎక్స్, వైలు తోడైతే అబ్బాయి పుడతారన్నది తెలిసిం దే. అయితే న్యూక్యాసల్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అంచ నా ప్రకారం పురుషుడి వీర్యంలో ఏ క్రోమోజోమ్‌ ఉండాలన్నది ఇప్పటివరకూ గుర్తించని ఇంకో జన్యువు నిర్ణయిస్తుంది.

ఈ జన్యువులో తల్లి, తండ్రి నుంచి అందిన 2 అల్లెల్లేలు ఉంటాయని, వీర్యంలో ఏ క్రోమోజోమ్‌ ఉండాలో ఇవి నిర్ణయిస్తాయని చెప్పారు. ఎం ఎం అల్లెల్లేలు ఉంటే వై క్రోమోజోమ్‌ ఎక్కువగా ఉండి అబ్బాయిలు పుట్టే అవకాశం ఎక్కువ అవుతుందని, ఎం అల్లెల్లేకు ఎఫ్‌ చేరితే ఎక్స్, వై క్రోమోజోమ్‌ లు రెండూ సమానంగా ఉం టాయని తెలిపారు. ఇలాంటి వారికి అబ్బాయిలు, అమ్మాయిలు సమంగా ఉంటారు. ఒకవేళ అల్లెల్లేలు రెండూ ఎఫ్‌ ఎఫ్‌ లు అయితే వారిలో ఎక్స్‌ క్రోమోజోమ్‌ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ఆడపిల్ల పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.