Begin typing your search above and press return to search.

డెల్టా వేరియంట్ పై తాజా అధ్యయనం తెలిస్తే.. చెమటలు పట్టాల్సిందే

By:  Tupaki Desk   |   25 Aug 2021 2:00 AM GMT
డెల్టా వేరియంట్ పై తాజా అధ్యయనం తెలిస్తే.. చెమటలు పట్టాల్సిందే
X
కరోనా అలియాస్ కొవిడ్ 19.. అందునా వూహాన్ వేరియంట్ గురించి తెలిసిందే. ఈ వేరియంట్ కే అప్పట్లో వూహాన్ ఎంతలా తల్లడిల్లిందో తెలిసిందే. ఈ వేరియంట్ తర్వాతి రోజుల్లో ప్రపంచమంతా పాకటం.. మ్యూటెంట్ చెంది కొత్త వేరియంట్లు రావటం తెలిసిందే. ఆ క్రమంలో వచ్చి చచ్చిందే డెల్టా వేరియంట్. దీని తీవ్రత ఇప్పటికే మనం రుచి చూశామన్నది తెలిసిందే. దేశంలోసెకండ్ వేవ్ తీవ్రతకు డెల్టా వేరియంట్ కూడా కారణమన్న మాట నిపుణుల నోట వినిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాల్లో ఒక ఊపు ఊపుతూ.. మూడో వేవ్ కు కారణమవుతున్న వేరియంట్ డెల్టాదే. దీనిపై నిర్వహించిన ఒక అధ్యయనం ఇప్పుడు చెమటలు పట్టిస్తోంది. డెల్టా వేరియంట్ తీవ్రత ఎంతన్న విషయాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. మొదటి రకం కొవిడ్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన వారిలో ప్రాథమిక దశలో 300 రెట్ల ఎక్కువ వైరల్ లోడ్ ఉందని తేలింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ లోడ్ తగ్గుతుందని చెప్పారు.

డెల్టా వేరియంట్ సోకిన వారిలో పది రోజుల తర్వాత కానీ ఇతర వేరియంట్లలో ఉండే వైరల్ లోడ్ స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇంత కచ్ఛితంగా ఎలా చెబుతున్నారంటే.. డెల్టా వేరియంట్ సోకిన 1848 మందిని.. ఇతర వేరియంట్ల బారిన పడిన 22వేల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అత్యధిక వైరల్ లోడ్ కారణంగానే డెల్టా వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందని గుర్తించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వైరల్ లోడ్ తీవ్రంగా ఉన్నప్పటికి.. వ్యాప్తి చేసే సామర్థ్యం అంత ఎక్కువగా లేకపోవటం కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పాలి. మొదటి రకం కోవిడ్ అంటే.. వూహాన్ వేరియంట్ కంటే రెండు రెట్లు.. అల్పా వేరియంట్ తో పోలిస్తే 1.6 రెట్లు ఎక్కువ వ్యాప్తి డెల్టా సొంతమని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదంటున్నారు. సో.. బీకేర్ ఫుల్ బాసూ.