Begin typing your search above and press return to search.

తాజా అధ్యయనం సంచలనం: ఒమిక్రాన్ ‘డెల్టా’ కంటే 70 రెట్లు అధికం

By:  Tupaki Desk   |   16 Dec 2021 4:30 PM GMT
తాజా అధ్యయనం సంచలనం: ఒమిక్రాన్ ‘డెల్టా’ కంటే 70 రెట్లు అధికం
X
కరోనా మహమ్మారి పీడ వదిలిందని అనుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్’ రాక ప్రపంచాన్ని మళ్లీ లాక్ డౌన్ దిశగా నడిపిస్తోంది. కొత్తరూపం మార్చుకున్న కోవిడ్ రాకాసి ఇప్పుడు అన్ని దేశాలపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా.. లేటెస్ట్ గా కేసులు విజృంభిస్తున్నాయి.

దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. గురువారం ఢిల్లీలో 4 కొత్త కేసులు ఒమిక్రాన్ నిర్ధారించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. దీనిపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ రోగుల సంఖ్య 10కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ రోగులలో ఒకరు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం మొత్తం 9మంది ఒమిక్రాన్ పాజిటివ్ రోగులు ఎల్.ఎన్.జేపీలో చేరారని ఆయన చెప్పారు.

ఒమిక్రాన్ తో సంబంధం ఉన్న మొత్తం 40 మంది రోగులు ప్రస్తుతం ఎల్ఎన్.జే.పీలో చేరారు. వారిలో 38మంది ఆరోగ్యం ఉన్నారు. మరో ఇద్దరు అనుమానితులుగా ఉన్నారు. ఈ ఉదయం విమానాశ్రయం నుంచి మరో 8 మంది అనుమానితులు వచ్చినట్లు జైన్ తెలిపారు.

కోవిడ్ 19 డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన కల్లోలం నుంచి తేరుకోకముందే కొత్త వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. రెండో వేవ్ లో కరోనా డెల్టా వేవ్ దేశంలో లక్షలమంది ప్రాణాలు తీసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం డెల్టా కంటే అత్యంత ప్రమాదకరమైనది తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

శరీరంలోకి గాలి ద్వారా ప్రవేశించే ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.