Begin typing your search above and press return to search.

దేశం నుంచి పారిపోయిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు!

By:  Tupaki Desk   |   5 March 2022 4:45 AM GMT
దేశం నుంచి పారిపోయిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు!
X
ఎన్నో రెట్లు అధికంగా ఉన్న ప్ర‌త్య‌ర్థి సైనిక ద‌ళం.. ఎంతో శ‌క్తిమంత‌మైన ఆయుధాలు వాళ్ల సొంతం.. త‌మ దేశాన్ని ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌త్య‌ర్థి అన్ని బ‌లాల‌తో దాడికి దిగింది.. కానీ చిన్న దేశ‌మే అయినా.. ఆయుధ సంప‌త్తి త‌క్కువ‌గానే ఉన్నా.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ వెన‌క్కి త‌గ్గేదేలే అని ఉక్రెయిన్‌ అధ్య‌క్షుడు ముందుకు సాగారు. నేరుగా యుద్ధ రంగంలో సైనికుల‌తో క‌లిసి సాగారు. ఆ స్ఫూర్తితోనే త‌మ కంటే ఎన్నో రెట్ల బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి సైన్యంతో ఆ దేశ బ‌ల‌గాలు, ప్ర‌జ‌లు పోరాడుతున్నారు. సుల‌భంగానే ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించుకోవ‌చ్చ‌ని భావించిన ర‌ష్యాకు షాక్ ఇస్తున్నారు.

ఏదేమైనా ర‌ష్యాకు త‌ల వంచేదే లేద‌ని చెప్పిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెగువ స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయ‌న ఇప్పుడు ఆ దేశాన్ని వ‌దిలి పారిపోయాడ‌నే వార్త ఒక‌టి తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

తాజాగా అణు యుద్ధానికి సైతం ర‌ష్యా వెన‌కాడ‌క‌పోవ‌డంతో త‌న ప్రాణాలు కాపాడుకోవ‌డానికి జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ను వీడాడా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. జెలెన్‌స్కీ త‌న కుటుంబంతో స‌హా పోలండ్‌కు పారిపోయార‌ని ర‌ష్యా మీడియా ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌ను ఉక్రెయిన్ ఖండించ‌క‌పోవ‌డంతో దానికి కౌంట‌ర్‌గా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది. దేశాన్ని కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు కూడా యుద్ధం పాల్గొనాల‌ని పిలుపునిచ్చిన జెలెన్‌స్కీ ఇలా మ‌ధ్య‌లో పారిపోతారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యాన్ని మాన‌సికంగా దెబ్బ కొట్టేందుకు ర‌ష్యా మీడియా ఇలా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఉక్రెయిన్ కూడా ఎలాంటి గంద‌ర‌గోళానికి తావివ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే అధ్య‌క్షుడి విష‌యంలో గోప్య‌త పాటిస్తుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఏదేమైనా వెన‌క‌డ‌గు వేసేదే లేద‌ని ప్ర‌క‌టించిన జెలెన్‌స్కీ ఇలా మ‌ధ్య‌లోనే పోరు వ‌దిలి పారిపోర‌ని ఆ దేశ ప్ర‌జ‌లు అంటున్నారు. మ‌రి ర‌ష్యా మీడియా ప్ర‌క‌ట‌న‌లో నిజం ఉందో? లేదో? తేల‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. మ‌రోవైపు ర‌ష్య‌న్లంద‌రూ ఏక‌మై పుతిన్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని అధ్య‌క్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్ పిలుపునిచ్చింది. ఇటీవ‌ల ఇరుప‌క్షాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌పై ఉక్రెయిన్ స్పంద‌న ఆధారంగా త‌మ త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ ఉంటుంద‌ని క్రెమ్లిన్ అధికార ప్ర‌తినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

తాజాగా ఉక్రెయిన్‌లోని జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రం స‌మీపంలో ర‌ష్యా చేప‌ట్టిన దాడుల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంత‌ర్జాతీయ అణు విద్యుత్తు సంస్థ ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించింది. అయితే ఆ దాడుల‌తో అక్క‌డి అణు రియాక్ట‌ర్ల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌లేద‌ని తెలిసింది.