Begin typing your search above and press return to search.
రూ. 41 లక్షలు పలికిన ఆ గణనాథుడి లడ్డు
By: Tupaki Desk | 20 Sept 2021 12:20 PM ISTఆ విఘ్నేశ్వరుడి లడ్డూలు వేలంపాటలో అధిక ధరలు పలికి ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించాయి. వినాయకుడి చేతి లడ్డూలను దక్కించుకోవడం కోసం భక్తులు చాలా ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది కరోనాతో వేలంపాట నిలిచిపోయిన విషయం విధితమే. కాగా ఈయేడు లడ్డూను సొంతం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. అన్ని పూజలకు ఆది దేవుడైన గణనాథుడి లడ్డూ వేలం ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. వేలంపాటలో మళ్లీ ఈ ఏడాది బండ్లగూడ లడ్డూ టాప్ లో నిలిచింది. 2019లో రూ.18.51 లక్షలు ధర పలుకగా ఈసారి ఏకంగా రూ.41 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను రిచ్‌మండ్ విల్లా సభ్యులు కైవసం చేసుకుని రికార్డును నిలుపుకున్నారు. 4 కిలోల లడ్డు రూ. 41 లక్షల ధర పలకడం విశేషం.
రెండో స్థానంలో బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.18.90లక్షల ధర పలికింది. ఈ లడ్డూను ఏపీకి చెందిన కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డిలు భాగస్వాములుగా దక్కించుకున్నారు. మూడో స్థానంలో మైహోంభుజ లడ్డూను వ్యాపారవేత్త విజయభాస్కర్ రెడ్డి రూ. 18.50లక్షలకు కైవసం చేసుకున్నారు. నాలుగోస్థానంలో బడంగ్ పేట లడ్డు రూ. 10లక్షలు ధర పలికింది. మరోవైపు బాగ్ లింగంపల్లి యాదాద్రి కాలనీలో వక్రతుండాయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో నిర్వహించిన స్వామి వారి లడ్డూను అదే కాలనీకి చెందిన ముస్లిం సోదరుడు ముస్తఫా రూ.75,200లకు దక్కించుకొని మతసామరస్యాన్ని చాటాడు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట జరుగుతుంది. మెుదటిసారి కొలను మోహన్ రెడ్డి కుటంబం 450 రూపాయలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ కు చెందిన కొలను కుటుంబం వారే..9 సార్లు దక్కించుకున్నారు. గతేడాది కరోనా వ్యాప్తి వల్ల వేలంపాట జరగలేదు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్ కు ఆ లడ్డూను అందజేశారు. వేలంపాటలో స్థానికులైతే డబ్బును మరుసటి ఏడాది చెల్లిస్తారు. స్థానికేతరులకు మాత్రం అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి. 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.