Begin typing your search above and press return to search.

రావణుడికి నిజంగా విమానం ఉందా తేల్చ బోతున్నారు

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:49 AM GMT
రావణుడికి నిజంగా విమానం ఉందా తేల్చ బోతున్నారు
X
పురాణాల్లో జరిగిన ప్రతిదీ మనకి ఇప్పటికీ ఒక ప్రశ్నగానే కనిపిస్తుంది. ఇలాంటి వాటిల్లోనే పుష్పక విమానం రావనుడి దగ్గర ఉండేదని రామాయణ కథలు చెబుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా రావణుడు ఆ పుష్పక విమానం లోనే వెళ్లేవాడిని వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకుని తర్వాత చాలా మంది రామాయణ రచన చేశారు. ఇందులో కూడా లంకకు అధిపతి అయిన రావణుడు పుష్పక విమానం లోనే ప్రయాణించినట్లు అతను చెప్పారు. సీతమ్మ వారిని అందులోనే లంకకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

రావనుడి దగ్గర పుష్పక విమానం అనేది అసలు ఉందా లేదా అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. చాలా మంది ఈ విషయాన్ని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉన్నారు. అవన్నీ అభూతకల్పనలు అని వారి నమ్మకం. అయితే రావణుడి దగ్గర నిజంగానే పుష్పక విమానం ఉందా లేదా అనే దానిపై శ్రీలంక ప్రభుత్వం శోధన ప్రారంభించింది. నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై పరిశోధన కొంత మొత్తాన్ని కూడా ఇచ్చింది. అంతేకాకుండా రామాయణ గాథ తో సంబంధం ఉన్నటువంటి మరో దేశమైన భారత్ ను కూడా ఇందులో పాల్గొనాలని ఆదేశ శాస్త్రవేత్తల బృందం కోరింది.

రావనుడి వద్ద ఆ విమానం ఉందని దాన్ని శ్రీలంక ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. కానీ దీనిని బలపరిచే ఆనవాళ్లు ఇంకా ఎక్కడ బయట పడలేదు. అందుకే ఈ విషయంపైనా శ్రీలంక భారత్ కు చెందిన పురావస్తు శాఖ చరిత్రకారుల బృందం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఈ విషయంపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టింది. ఎన్నో వాదోపవాదాలు దీనిపై జరిగాయి.. చివరిగా లంకాధిపతి శ్రీలంక నుంచి భారత్కు విమాన ప్రయాణం చేశాడని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇంతటితో ఈ చర్చలకు పుల్స్టాప్ పెట్టకుండా ఈ అంశంపై చాలా రోజుల పాటు పరిశోధన చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ పరిశోధనల్లో భాగంగానే శ్రీలంక ప్రభుత్వం అక్కడి నీ కరెన్సీలో ఐదు మిలియన్ల రూపాయలను విడుదల చేసింది. ఇదే సమయంలో కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఈ కారణంగానే ఈ పరిశోధన తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు దేశాల్లో కరోనా కేసులు తక్కువ నమోదు అతున్న నేపద్యంలో ఈ పరిశోధనకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగిన పరిశోధనను తిరిగి పునః ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో రావణాసురునికి పుష్పక విమానం ఉందా లేదా అని తేల్చే ప్రక్రియ మరో కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది.