Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   25 Feb 2022 6:03 AM GMT
#RussiaUkrainewar: అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న ఉక్రెయిన్
X
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చంతా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం eఆక్రమించుకుంటానని రష్యా చెప్పడం లేదు. కానీ నాటోకు సపోర్టు చేయొద్దని అంటోంది. అయితే ఉక్రెయిన్ ఇటు రష్యా, అటు ఈయూ దేశాలతో బార్డర్ పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈయూతో సన్నిహితంగా ఉండొద్దన్నదే రష్యా లక్ష్యం..

ఉక్రెయిన్లో అల్లకల్లో పరిస్థితులు నెలకొడానికి ముఖ్య కారణం యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలే అని అర్థమవుతోంది. 2014 వరకు ఉక్రెయిన్ రష్యాతో సామాజిక జీవితం కలిసి గడిపింది. ఉక్రెయిన్లో రష్యన్ మాట్లాడేవాల్లు చాల మందే ఉన్నారు. అయితే 2014లో రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రష్యా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఈయూ దేశాలు తమకు అండగా ఉంటాయని ఉక్రెయిన్ భావించింది. కానీ ఇప్పుడు ఈయూ దేశాలు హ్యాండిచ్చారు. ఉక్రెయిన్ కు ఇతర సాయం చేస్తాం.. కానీ సైనిక బలగాలను పంపించే ప్రసక్తే లేదని ప్రకటించాయి.

రష్యా ఉక్రెయిన్ పై దాడికి కారణమేంటనే చర్చ తీవ్రంగా సాగుతోంది. వాస్తవానికి ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ పుతిన్ వ్యాఖ్యలు మాత్రం ఒక్కోసారి వేరే రకంగా ఉంటున్నాయి. 1991 నాటి రష్యా చారిత్రక విచ్చిన్నం అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను పూర్తిగా కమ్యూనిస్టు దేశంగా మార్చాలని అంటున్నారు. అయితే తమ దేశంలో మాత్రం ఉక్రెయిన్ ను కలిపేసుకోమని అంటున్నారు. ప్రధానంగా ఆయన ఉద్దేశం నాటో దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండకూడదని వాదిస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ కు నాటో తోడైతే ఎప్పటికైనా రష్యాకు ముప్పు వాటిట్లే ప్రమాదం ఉందని పుతిన్ భావిస్తున్నారు.

ఈనేపథ్యంలో ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ ను హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం తీసుకుంటే రష్యాకు వ్యతిరేకమవుతారని అంటన్నారు. అంతేకాకుండా క్రిమియాను ఉక్రెయిన్ లాక్కుంటుందని అంటున్నారు. ఇక రష్యా సరిహద్దుల్లో నాటో దళాలు ఉండకూదనేది పుతన్ మరో లక్ష్యం. నాటో దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉంటే యూరప్ దేశాలతో తమకు ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు.

నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ (నాటో)లో ఇప్పటికే 30 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో సభ్యత్వ దేశాలు తమకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా కలిసి రక్షణ వ్యవస్థగా మారుతాయి. ఇందులో ఏ ఒక్క దేశం పై దాడి జరిగినా 30 దేశాలకు చెందిన బలగాలు ఎదురుతిరుగుతాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత కొన్ని దేశాలు నాటోలో చేరాయి. ఈ క్రమంలో జార్జియా, ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇస్తే ఈయూ దేశాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉక్రెయిన్ ద్వారా రష్యాపై నేరుగా యుద్ధం చేయడానికి ఆస్కారం ఉంటుంది.

నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇచ్చే ప్రయత్నాన్ని కనిపెట్టిన రష్యా వెంటనే అప్రమత్తమైంది. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాటోలో ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వబోమని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరాడు. కానీ అయితే అందుకు నాటో ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైతం నాటోలో చేరితే రష్యా నుంచి రక్షణ లభిస్తుందని భావించింది. అయితే ఉక్రెయిన్ పరిస్థితిని పూర్తిగా చదివిన పుతిన్ నేరుగా యుద్ధం ప్రకటించారు.

ప్రస్తుతం నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఎలాంటి సాయం చేయడం లేదు. అయితే ఈయూ దేశాలతో సత్సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో సాధారణ సాయం చేస్తామని ప్రకటించారు. మెడికల్ సదుపాయం, సలహాదారులను పంపిస్తామని అన్నారు. కానీ సైనిక బలగాలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఉక్రెయిన్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పుడు ఉక్రెయిన్ ఎవరి చెంతకు చేరుతుందో చూడాలి..