Begin typing your search above and press return to search.

జొమాటో.. స్విగ్గీలు చేసే పాడు పనులు కళ్లకు కట్టే విచారణ షురూ

By:  Tupaki Desk   |   5 April 2022 9:30 AM GMT
జొమాటో.. స్విగ్గీలు చేసే పాడు పనులు కళ్లకు కట్టే విచారణ షురూ
X
సమయం ఏదైనా సరే.. ఏమైనా తినాలని అనుకున్నంతనే చేతిలోని ఫోన్ తీసి.. అందులోని ఫుడ్ యాప్ ల్లో ఆర్డర్ ఇవ్వటం.. కాసేపటికే కోరుకున్న ఆహారం ఇంటి ముంగిట్లోకి రావటం తెలిసిందే. దీనికి కొంచెం ఖర్చు అయినా.. శ్రమ లేకుండా కోరుకున్న ఫుడ్ వస్తున్నప్పుడు.. ఖర్చు పెట్టేందుకు ఎవరు మాత్రం వెనకాడుతారు చెప్పండి. ఈ కారణంతోనే మహానగరాలతో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్ లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు ఈ యాప్ లో ఇప్పుడు పుడ్ మాత్రమే కాదు.. గ్రోసరీ వస్తువుల్ని సైతం డెలివరీ చేస్తున్నాయి.

ఫుడ్ యాప్ లు అన్నంతనే గుర్తుకు వచ్చేవి జొమాటో.. స్విగ్గీలు మాత్రమే. గతంలో వేర్వేరు బ్రాండ్లు ఉన్నా.. ఇప్పుడైతే మాత్రం ప్రాంతంలో సంబంధం లేకుండా ఈ రెండు సంస్థలు దూసుకెళుతున్నాయి. మరే సంస్థను తమ దరిదాపుల్లోకి రాకుండా చేస్తున్నాయి.

అయితే.. ఈ రెండు సంస్థలు కొన్ని హోటళ్లు.. రెస్టారెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం.. తమకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిన వారి హోటళ్లు.. రెస్టారెంట్లు పేర్లను టాప్ లో చూపించటం.. సెర్చింగ్ లో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం లాంటి పాడు పనులకు పాల్పడతారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సంస్థలు చేసే పాడు పనుల మీద విచారణ జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. జొమాటో.. స్విగ్గీలు చేసే పాడు పనులను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు విచారణలో భాగంగా డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రాథమికంగా అభిస్తున్న ఆధారాల్ని చూసినప్పుడు కొన్ని బ్రాండ్లకు ఈ సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. మిగిలిన ఆహార సంస్థల మీద ప్రభావం పడేలా వ్యవహరిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్ని సీసీఐ తన 32 పేజీల ఉత్తర్వుల్లో వెల్లడించింది. కొన్నింటికి ఎక్కువ డిస్కౌంట్లను ఇవ్వటం ద్వారా వినియోగదారులు వాటి వైపు మొగ్గు చూపేలా చేయటం లాంటి పనుల్ని చేస్తోంది. వీటిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సంస్థలపై విచారణ జరగనుంది. ఇందులో తప్పు నిరూపితమైతే.. ఈ రెండు సంస్థలకు ఎదురుదెబ్బలు తప్పవంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.