Begin typing your search above and press return to search.

తెలుగు వారిలో 'చైత‌న్యం' నింపిన 'ర‌థం'.. నేడు ఎలా ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   29 March 2022 9:30 AM GMT
తెలుగు వారిలో చైత‌న్యం నింపిన ర‌థం.. నేడు ఎలా ఉందో తెలుసా?
X
తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో.. 1982, మార్చి 29న ఉద్భ‌వించిన తెలుగు దేశం పార్టీ ఒక సంచ‌ల‌నం. ప్రాంతీయ పార్టీల్లోనే త‌ల‌మానికం. ఎక్క‌డైనా.. ప్రాంతీయ పార్టీలు పుట్టాయంటే.. అప్ప‌టి వ‌రకు త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నో.. లేక పార్టీల్లో గుర్తింపు లేద‌నో.. కార‌ణాలుగా క‌నిపిస్తే.. ఏపీలో టీడీపీ ఆవిర్భావం.. ఒక ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌. తెలుగు వాడి గుండెచ‌ప్పుడుకు ప్ర‌తీక‌. పార్టీ ప్ర‌చాద‌ర‌ణ పొంద‌డానికి.. ప్ర‌చార‌మే కీల‌కంగామారింది.అన్న‌గారు ఎన్టీఆర్‌.. ప్ర‌జ‌ల్లోకి పార్టీని తీసుకువెళ్లేందుకు.. అహ‌ర‌హం శ్ర‌మించారు.

గ్రామీణ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు... ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లోనేఉన్నారు. వారిమ‌ధ్య భోజ‌నాలు.. వారితోనే.. అన్నీ.. అన్న‌ట్టుగా అన్న‌గారు ప్ర‌జ‌ల్లో క‌లియ‌దిరిగారు. ఈ క్ర‌మంలో అన్న‌గారి రాజ‌కీయాల‌తో ముడివేసుకున్న వారు ఎంద‌రో ఉన్నారు. వ్య‌క్తులు.. వ్య‌వ‌స్థ‌లు కూడా అన్న‌గారితో ముడి వేసుకున్నాయి. ఇలాంటి వాటిలో 'చైత‌న్య ర‌థం' ఒక‌టి. ఎన్టీఆర్‌ ప్రచారంలో కీలకపాత్ర చైతన్య రథానిదే. ఎంతో ఆకర్షణీయంగా విశాలంగా సకల వసతులతో ఉండే ఆ వాహనంలోనే అన్న‌గారు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం క‌లియ‌దిరిగి.. ప్ర‌చారం చేశారు.

ఈ ప్ర‌చార ర‌థాన్ని న‌డిపిన డ్రైవ‌ర్‌.. సాక్షాత్తూ అన్న‌గారి కుమారుడు.. దివంగ‌త హ‌రికృష్ణ కావ‌డం.. మ‌రిం త విశేషం. అయితే.. ఈ వాహ‌నం తాలూకు విశేషం ఏంటంటే.. ఈ వాహ‌నం.. కొత్తది కాదు. అప్ప‌టికే.. వినియోగించిన వాహ‌నం.

అది కూడా.. త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీని స్థాపించిన ఎంజీ ఆర్ ఒక వాహ‌నం కొనుగోలు చేసి.. దాంతోనే రాష్ట్రంలో తిరిగి.. పార్టీని ప్ర‌చారం చేసి, అన‌తి కాలంలోనే అధికారంలోకి తెచ్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అన్న‌గారు.. 1982లో టీడీపీని స్థాపించిన త‌ర్వాత‌.. ప్రచారం కోసం ఆ వాహనాన్ని ఎంజీఆర్‌ నుంచి కొనుగోలు చేశారు.

ఎంజీఆర్‌కు అచ్చు వ‌చ్చిన‌.. వాహ‌నం కాబ‌ట్టి.. అన్న‌గారు కొన‌నుగోలు చేయ‌డం.. అప్ప‌ట్లో సినీ వ‌ర్గాల్లో ప్ర‌చారంలో ఉండేది. ఆ వాహ‌నంలో తనకు కావాల్సిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయించుకున్నారు. కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశమయ్యేందుకు పొడవైన సోఫా, టాయిలెట్‌, వాహనం లోపలి నుంచే పైకి ఎక్కేందుకు మెట్లు ఆ వాహనంలో ఉంటాయి.

అలా లోపలి నుంచే వాహనంపైకి ఎక్కి వేలాది బహిరంగ సభల్లో ఎన్టీఆర్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్కు చేసి ఉంచారు. అయితే.. ఎన్జీఆర్‌ చనిపోయాక నాచారంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు. ప్ర‌స్తుతం చైత‌న్య ర‌థం అక్క‌డే ఉంది.