Begin typing your search above and press return to search.

టు ద పాయింట్ : పొరపాటుపడుతున్న కేటీఆర్ ?

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 AM GMT
టు ద పాయింట్ : పొరపాటుపడుతున్న కేటీఆర్ ?
X
మ‌నం అభివృద్ధి చెందాం అని అనుకోవ‌డంలో త‌ప్పులేదు.. మ‌నం అభివృద్ధికి కార‌ణం అయిన ప‌నుల‌నే చేస్తున్నాం అని గౌర‌వ నాయ‌కులు చెప్పుకోవ‌డంలోనూ త‌ప్పు లేదు. వాస్త‌వాలు ప్ర‌పంచం ఎదుట ఉంటాయి క‌నుక లేదా వాస్త‌వాల‌కు అతీతంగా ఎవ్వ‌రూ ఉండ‌రు క‌నుక మ‌నం ఏం చెప్పినా చెల్ల‌దు. మ‌నం అన‌గా మ‌న గౌర‌వ నాయ‌కులు ఏం చెప్పినా చెల్ల‌దు. అర్థ స్ఫూర్తి అన్న‌ది ఒక‌టి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్ర‌జ‌ల జీవితాలు మ‌న అనుకునే నాయ‌కుల జీవితాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

తెలంగాణ‌ను బంగారు తెలంగాణను చేశామ‌ని కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా త‌ప్పు కాదు. ఆ విధంగా చెప్ప‌డం వారి రాజ‌కీయ అవ‌స‌రం. బాధ్య‌త కూడా ! ప్ర‌జ‌ల బాధ్య‌త‌లు కొన్ని ప్ర‌భుత్వ బాధ్య‌త‌లు కొన్ని క‌లిసి విశేషం అయిన ఫ‌లితాలు అందిస్తాయి.

ఆ విధంగానే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది. కానీ ఇవాంక వ‌స్తుంద‌ని ఓ సారి ట్రంప్ వ‌స్తున్నాడ‌ని మ‌రోసారి తెలంగాణ దారుల‌కు తాత్కాలిక మోక్షం ఇవ్వ‌డం ఓ విధంగా అవివేక‌మే ! ఆ రోజు హైద్రాబాద్ న‌గ‌ర దారుల‌కు అభివృద్ధి పేరిట తాత్కాలిక మోక్ష‌మే ఇచ్చారు ఆయ‌న. ఆ త‌రువాత కేటీఆర్ మిగ‌తా ప్రాంతాల‌ను అదే విధంగా తీర్చిదిద్దాల‌ని డిమాండ్ చేశారు. అంటే ఇవాంకా ప‌ర్య‌టించిన ప్రాంతంలోనో లేదా ట్రంప్ తిరుగాడిన ప్రాంతంలోనో తాత్కాలిక అభివృద్ధి ఒక‌టి జ‌రిగింది. అదేవిధంగా కొంద‌రు పేద‌ల‌ను వేరే ప్రాంతాలకు త‌ర‌లించిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి.

బ‌స్తీలు క‌న‌ప‌డ‌కుండా కేవ‌లం అభివృద్ధి చెందిన న‌గ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల మీదుగానే ట్రంప్ కాన్వాయ్ వెళ్లిన విధంగా రూట్ మ్యాప్ ఒక‌టి అమెరికా ప్ర‌తినిధి బృందానికి ఇచ్చి., తెలంగాణ అధికారులు ట్రంప్ వెళ్ల‌గానే ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. దానినే కేటీఆర్ హైలెట్ చేస్తున్నారు.. ఆ రోజు బ‌స్తీలు క‌నప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డిన కేటీఆర్ పాపం అదే జాగ్ర‌త్త అమిత్ షా వ‌ర్గాలో బీజేపీ వ‌ర్గాలో గుజ‌రాత్ విష‌య‌మై ప‌డుతుంటే త‌ట్టుకోలేక‌పోతున్నారు.

అంటే గుజ‌రాత్ లోని బోరిస్ జాన్స‌న్ అనే బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సాగిన‌ప్పుడు న‌గ‌రం అందంగా క‌న‌ప‌డాల‌నో సంబంధిత ప్రాంతం అందంగా క‌న‌ప‌డాల‌నో తాప‌త్ర‌యంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ద‌వ‌ళ వ‌స్త్రాల‌తో (తెల్ల‌ని వ‌స్త్రాల‌తో) కూడిన ప‌ర‌దాలు ఏర్పాటు చేసి, అనాగ‌రిక‌త‌ను క‌ప్పి పెడుతున్నార‌ని, దాచి ఉంచుతున్నార‌ని, అభివృద్ధి లేని విషయం క‌నిపించ‌కుండా చేస్తున్నార‌ని ఇదేనా మీ డబుల్ ఇంజిన్ మోడ‌ల్ అని ప్ర‌శ్నిస్తూ..బీజేపీ చ‌ర్య‌ల వెనుక ఉన్న డ‌బుల్ మీనింగ్ ఏంట‌న్న‌ది వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌న దాకా వ‌స్తే గాని తెలియ‌ని పెద్ద‌లు అంటారు.. మ‌రి ! ఆరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసిందేంటి? ఇప్పుడు బీజేపీ వ‌ర్గాలు చేస్తున్న‌దేంటి ? క‌నుక ప్ర‌శ్నించేట‌ప్పుడు స‌హేతుకత అన్న‌దే ప్ర‌థ‌మ ల‌క్ష‌ణం కావాలి. ఆ విధంగా లేక‌పోతే ఎవ్వ‌రైనా త‌ప్పుల‌కు ఈ విధంగానే దొరికి పోతారు. న‌వ్వుల పాల‌వుతారు. అందుకు కేటీఆర్ మిన‌హాయింపు కాదు.