Begin typing your search above and press return to search.

రష్యాను చావుదెబ్బ తీసిన అమెరికా..

By:  Tupaki Desk   |   10 March 2022 3:40 AM GMT
రష్యాను చావుదెబ్బ తీసిన అమెరికా..
X
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా అమెరికాతో పాటుగా పలు దేశాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను రష్యాపై విధించాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ యూరప్ దేశాలతో కలిసి రష్యాపై ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 8 నుంచి రష్యా చమురు, గ్యాస్ మరియు ఇంధన దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రష్యాను చావుదెబ్బ తీసే ప్రకటన చేశారు.

అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ మాట్లాడుతూ తాము చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక ఆంక్షల ప్యాకేజీని అమలు చేస్తున్నామని, ఇది రష్యా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తోందని బిడెన్ అన్నారు.

అమెరికా పలు దేశాలతో కలిసి రష్యాపై భారీ ఆంక్షలు విధించి ప్రపంచంలో ఆ దేశాన్ని ఏకాకిగా నిలిపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది..ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయిందని బైడెన్ విమర్శించారు. రష్యా కరెన్సీ విలువ ఏకంగా పాతాళానికి పడిపోయిందని బైడెన్ విమర్శించారు. అధ్యక్షుడు బిడెన్ ఈమేరకు యూరప్ దేశాలకు ఈ విజ్ఞప్తి చేశారు. "మా యూరోపియన్ మిత్రదేశాలు.. భాగస్వాములు చాలా మంది మాతో చేరే స్థితిలో లేరు. కానీ మేము ఈ నిషేధాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము" అని ప్రకటించారు. చమురు - పెట్రోలియం ఉత్పత్తుల్లో అమెరికా చేసుకునే దిగుమతులలో రష్యా వాటా కేవలం 10 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం చాలా తక్కువ. అందుకే జోబిడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇంతకుముందు యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలు.. ప్రధానంగా రష్యా ఇంధన సరఫరాలపై చాలా ఆధారపడినందున రష్యా నుండి దిగుమతులను రాత్రిపూట నిలిపివేయడం సాధ్యం కాదని ప్రకటించాయి. మరోవైపు యుద్దంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత్ 'ఆపరేషన్ గంగా'ను ప్రారంభించింది. మార్చి 8న, ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న 694 మంది భారతీయ విద్యార్థులను భారతదేశం అక్కడి నుంచి ఖాళీ చేయించింది.

సుమీలో చిక్కుకున్న మొత్తం 694 మంది భారతీయ విద్యార్థులు బస్సుల్లో పోల్తావాకు బయలుదేరినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియాకి తెలిపారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు.

రష్యా -ఉక్రెయిన్ నాయకుల మధ్య ప్రత్యక్ష సంభాషణ శాంతిని నెలకొల్పడానికి సహాయపడుతుందని సూచించారు. సుమీలో మిగిలి ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత గురించి తన లోతైన ఆందోళనను కూడా పుతిన్ కు తెలియజేశాడు.వాళ్లు క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని మోడీ కోరారు.