Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ దేశానికి అవసరం.. ఆస్తినంతా ఇచ్చేసిన పుష్ప

By:  Tupaki Desk   |   6 April 2022 10:01 AM GMT
రాహుల్ గాంధీ దేశానికి అవసరం.. ఆస్తినంతా ఇచ్చేసిన పుష్ప
X
78 ఏళ్ల పుష్ప ముంజియాల్ తన రూ. 50 లక్షల విలువైన ఆస్తి మొత్తాన్ని ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇచ్చేసింది. దేశానికి రాహుల్ ఆలోచనలు అవసరమని ఈమేరకు తన ఆస్తిని ఆయన పేరిట రాసేసి వార్తల్లోకి ఎక్కింది. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ బామ్మా ఈ పని చేసి వార్తల్లోకి ఎక్కారు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ముంజియాల్ తన ఆస్తుల యాజమాన్య హక్కును రాహుల్ గాంధీకి ఇస్తూ కోర్టులో వీలునామా సమర్పించారు. రాహుల్ ఆలోచనలకు తాను చాలా ప్రభావితమయ్యానని, అందుకే తన ఆస్తిని అతనికి ఇచ్చానని చెప్పింది.

కాంగ్రెస్ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ నివాసంలో ముంజియల్ తన ఆస్తిని రాహుల్‌కు విల్ చేసినట్లు తెలిపారు. పదవీ విరమణ వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన పుష్ప గత 23 ఏళ్లుగా డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌ధామ్‌ అనే వృద్ధాశ్రమంలో ఉంటోంది.

ఆమె తల్లిదండ్రులు చాలా కాలం క్రితం మరణించారు. ఆమె సోదరుల్లో ఒకరు క్యాన్సర్‌తో మరణించారు. ఇప్పుడు, ఆమెకు ఒక సోదరి ఉంది. తన ఆస్తిని రాహుల్ గాంధీకి ఇవ్వాలని ముంజియాల్ తీసుకున్న నిర్ణయంతో ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీపై ముంజియాల్ ప్రశంసలు కురిపించింది. "రాహుల్ ప్రజా సేవ కోసం పరితపిస్తాడు. ముక్కుసూటిగా.. అమాయకత్వం కలిగి ఉంటాడు. ప్రజలు అతన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన కుటుంబం దేశం కోసం ఎనలేని త్యాగం చేసింది' అరి ముంజియాల్ పేర్కొంది.

రాహుల్‌కు కానుకగా ఇచ్చిన 10 తులాల బంగారాన్ని అతడి భార్యకు పెళ్లయ్యాక బహుమతిగా ఇవ్వాలని ముంజియాల్ విజ్ఞప్తి చేసింది. రాహుల్‌ను తన కొడుకుగా భావిస్తున్నానని ఆమె అనడం విశేషం.