Begin typing your search above and press return to search.

పంచ్ ప్రభాకర్ కేసుపై మళ్లీ విచారణ, డెడ్ లైన్ 23

By:  Tupaki Desk   |   22 Feb 2022 8:30 AM GMT
పంచ్ ప్రభాకర్ కేసుపై మళ్లీ విచారణ, డెడ్ లైన్ 23
X
న్యాయమూర్తులను, న్యాయస్థానాన్ని దూషిస్తూ పంచ్ ప్రభాకర్ ఇంకా వీడియోలను అప్ లోడ్ చేస్తున్నాడా ? అవుననే అంటున్నారు హైకోర్టు తరపు లాయర్ అశ్వనీకుమార్. న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ముందు సీఐడీకి ఈ కేసులను అప్పగించినా పురోగతి వేగంగా కనబడలేదు. దాంతో సీఐడీని తప్పించి హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

న్యాయమూర్తులను, న్యాయవ్యవస్ధలను దూషించిన విషయంలో చాలామందిని గుర్తించినా కేసులను 33 మంది మీద మాత్రమే నమోదు చేశారు. వీరిలో 11 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. ఇంకా కొందరి విషయంలో విచారణ జరుగుతోంది. ఇదే విషయమై కోర్టులో జరిగిన విచారణలో హైకోర్టు లాయర్ మాట్లాడుతు పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తు అభ్యంతరకర వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఎవరైనా అలాంటి వీడియోలను చూడాలని రిక్వెస్టు చేస్తే అనుమతిస్తున్నట్లు చెప్పారు.

కాబట్టి అలాంటి వీడియోలను బ్లాక్ చేయాలన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో సీబీఐ, యుట్యూబ్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కోర్టు మార్చి 21ని ఇద్దరికీ డెడ్ లైన్ పెట్టింది. అప్పటిలోపు పూర్థిస్థాయి చర్యలు తీసుకుని కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది.

యూట్యూబ్ తరపున లాయర్ సంజయ్ పూవయ్య మాట్లాడుతు అదంతా టెక్నికల్ అంశాలని, అవకాశముంటే బ్లాక్ చేస్తామని చెప్పారు. సీబీఐ లాయర్ రాజు మాట్లాడుతూ ఇప్పటివరకు 33 మందిపై కేసులు నమోదు చేయగా 11 మందిపై చార్జిషీటు దాఖలు చేసినట్లు చెప్పారు. కొంతమంది విషయంలో యాక్షన్ తీసుకునేందుకు అవసరమైన సమాచారం లేదన్నారు. మరికొందరి నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే న్యాయమూర్తులు, న్యాయస్ధానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిలో చాలామంది విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో స్ధిరపడిన వారిపై యాక్షన్ తీసుకోవటం అంత తేలిక్కాదు. విదేశాల్లో ఉన్న వారిపై యాక్షన్ తీసుకోవాలంటే ముందు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. కేంద్రం నుండి వాళ్ళు ఏ దేశంలో ఉంటున్నారో ఆ ప్రభుత్వంతో సంప్రదించాలి. వాళ్ళమీద చర్యలు తీసుకునేందుకు ఆ ప్రభుత్వం అంగీకరించాలి. కొన్ని ప్రభుత్వాలు అంగీకరిస్తాయి మరికొన్ని ప్రభుత్వాలు స్పందించవు. కాబట్టే ఈ విషయంలో బాగా జాప్యం జరుగుతోంది. మరి ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.