Begin typing your search above and press return to search.

పీకే సాధించేదేంటి?

By:  Tupaki Desk   |   7 March 2022 11:30 PM GMT
పీకే సాధించేదేంటి?
X
కొత్త‌గా రాజ‌కీయ స‌న్నివేశాల‌ను మార్చేద్దాం అన్న‌ది కేసీఆర్ అనుకుంటున్న ప్ర‌తిపాద‌న లేదా క‌ల కూడా అదే కావొచ్చు. కల‌లు సంబంధిత రంగులు ఎలా ఉన్నా కూడా సాధించాల్సినంత సాధించేందుకు త‌న వంతు క‌ష్టం తానే ప‌డ‌తాన‌ని కేసీఆర్ అంటున్నారు.

ఇదే స‌మ‌యంలో ఎన్డీఏ స‌న్నిహితుల‌తోనో లేదా యూపీఏ స‌న్నిహితుల‌తోనో స‌ఖ్యత పెంచుకోవాల‌ని క‌ల‌లు కంటున్నారు. కానీ అందుకు త‌గ్గ విధంగా ప‌రిణామాలు ఏవీ లేవు అని తేలిపోయింది. ఇంత‌వ‌ర‌కూ కేసీఆర్ కు కేజ్రీ అభ‌యం లేదు. స్టాలిన్ అభ‌యమూ లేదు. ఇక బిజూ జ‌న‌తాదళ్ సాయ‌మూ లేదు.

అలాంటిది ఆయన ఏవిధంగా అనుకున్న‌ది సాధిస్తార‌న్న వాద‌న ఒక‌టి విపరీతంగా హ‌ల్చ‌ల్ చేస్తోంది. గ‌తంలో మాదిరిగానే ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు రాగానే ఆయ‌న సైలెంట్ అయిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టివర‌కూ బీజేపీ హ‌వా ఏ విధంగా ఉందో రేప‌టి వేళ యూపీలో అదే హంగామా మ‌రియు హ‌వా కొన‌సాగ‌డం కూడా ఖాయం.అప్పుడు ఎలా అనుకున్న‌ది సాధిస్తార‌ని..అంటే యూపీ నే ప్రామాణికంగా తీసుకుంటే బీజేపీ కేంద్రంలో మ‌రోసారి పాగా వేసేందుకు ప‌రిస్థితులు అనుకూలిస్తే అందుకు భిన్నంగా ఓ వాతావ‌ర‌ణ సృష్టి అన్న‌ది సాధ్యం కాని ప‌ని.

ఈ నేప‌థ్యంలో పీకే వ‌చ్చి నా కూడా ప్ర‌యోజ‌నం శూన్యం.అయినా అంత‌ర్గ‌తంగా పార్టీ వ్య‌వ‌హారాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పే జిల్లా అధ్య‌క్షులు ఉండ‌గా, కొత్త‌గా స‌ర్వేలు పేరిట న‌డిపే వ్య‌వ‌హారాలు కానీ చేసే వ్యూహాలు కానీ ఏవీ ఫ‌లించ‌వు అన్న‌దే ఓ వాద‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి...

ఈ నేపథ్యంలో..తెలంగాణ రాష్ట్ర స‌మితికి సంబంధించి ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా సీన్లోకి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిశోర్ కొత్త‌గా సాధించేందేంట‌న్న విమ‌ర్శ‌లు వినపడుతున్నాయి.త‌మ పార్టీలో ఉన్న అసంతృప్తుల గురించి కొత్త‌గా ఆయ‌న వ‌చ్చి చెప్పేదేంట‌న్న అస‌హ‌నం వ్య‌క్తం అవుతోంది.

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో రెండో శ్రేణి నాయ‌కుల కార‌ణంగానే పార్టీలో ఎదుగుద‌లే లేద‌న్న వాదన ఎప్ప‌టి నుంచో విన‌వ‌స్తోంది.ఇందుకు ఆధారాలు కూడా అధిష్టానం ద‌గ్గ‌ర ఉన్నాయి.ఈ సంద‌ర్భంలో పీకే వ‌చ్చి కొత్త‌గా చెప్పేదేంటి? అంటే ఆయ‌న వ‌చ్చి ప‌లికే దాకా లేదా ఉలికే దాకా అధి నాయ‌క‌త్వంలో ఉన్న వారెవ్వ‌రికీ పార్టీపై అవ‌గాహ‌నే లేకుండా పోయిందా అన్న ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది.