Begin typing your search above and press return to search.

మమ‌త‌కు అంత సీన్ లేదా?

By:  Tupaki Desk   |   11 March 2022 1:30 PM GMT
మమ‌త‌కు అంత సీన్ లేదా?
X
దేశంలో ప్ర‌ధాని మోడీకి తానే స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని.. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేద‌ని భావిస్తున్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ప‌శ్చిమ బెంగాల్ దాటి త‌న పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌ను విస్త‌రించాల‌నే ఆమె ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే అడ్డుక‌ట్ట ప‌డింది. జాతీయ పార్టీగా ఎదిగే దిశ‌గా వేస్తున్న అడుగులు ఆరంభంలోనే త‌డ‌బ‌డ్డాయి.

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిల‌బెట్టుకోవ‌డం దీదీని ఇబ్బంది పెట్టే అంశమైతే.. తృణ‌మూల్ కాంగ్రెస్ పోటీ చేసిన రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోక‌పోవ‌డం ఆమెను తీవ్ర నిరాశ‌ప‌రిచే విష‌య‌మే. గోవా, మ‌ణిపూర్‌లో ఆమె పార్టీ ఒక్క సీటు కూడా నెగ్గ‌లేదు.

ఆ గెలుపుతో..

ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వ‌యం వ్యూహ ర‌చ‌న‌ల‌ను త‌ట్టుకుని గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో త‌న పార్టీని దీదీ గెలిపించుకున్నారు. మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. దీంతో మోడీషా స‌వాలును త‌ట్టుకుని నిల‌బడ్డ మ‌మ‌తా బెన‌ర్జీ జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావించారు. మ‌రోవైపు బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ సార‌థ్యంలో కూట‌మి ఏర్పాటుకు మొద‌ట్లో స‌మ్మ‌తించిన దీదీ.. ఆ త‌ర్వాత దాన్ని వ్య‌తిరేకించారు.

కూట‌మిని న‌డిపే సామ‌ర్థ్యం కాంగ్రెస్‌కు లేద‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. మోడీకి తానే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని భావించారు. అందుకే పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా గోవా, మ‌ణిపూర్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచులేక‌పోయింది. మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీకి మ‌ద్ద‌తుగా ఆమె ప్ర‌చారం చేశారు. కానీ అక్క‌డా ఆ పార్టీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత‌మైంది.

ఇప్పుడు ఏం చేస్తారు?

జాతీయ రాజ‌కీయాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని భావించిన దీదీకి ఈ ఎన్నిక‌ల ఫ‌లితల‌తో ఆశాభంగం ఎదురైంది. మోడీకి వ్య‌తిరేంగా పోరాడాల‌ని భావించిన ఆమె ఇప్పుడు ఏం చేస్తారోన‌న్న చ‌ర్చ ఊపందుకుంది. మోడీపై పోటీకి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా నిల‌బ‌డేందుకు దీదీకి అంత సీన్ లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలే నిదర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక ఇప్పుడు నాన్ కాంగ్రెస్‌, నాన్ బీజేపీ కూట‌మి ఏర్పాటు దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన దీదీ ఎలాంటి అడుగులు వేస్తారో అన్న ఆస‌క్తి రేకెత్తుతోంది. ఇప్ప‌టికే కూట‌మి కోసం చ‌ర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కు ఆమె ఆహ్వానాలు పంపిన‌ట్లు స‌మాచారం. మ‌రికొన్ని ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌నూ ఆహ్వానిస్తార‌ని తృణ‌మూలు కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్పాయి. కానీ ఇప్పుడీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఆమె కూట‌మి ఏర్పాటు దిశ‌గా స‌మావేశం నిర్వ‌హిస్తారా? అనే దానిపై సందేహాలు క‌లుగుతున్నాయి.