Begin typing your search above and press return to search.

మోడీ గ‌డ‌ప‌లో కేసీఆర్ గొంతుక ?

By:  Tupaki Desk   |   2 March 2022 4:56 AM GMT
మోడీ గ‌డ‌ప‌లో కేసీఆర్ గొంతుక ?
X
కాశీ విశ్వేశ్వ‌రుడి చెంత పంచాక్ష‌రీ మంత్రం ప్ర‌భ‌విల్లే పుణ్య‌ధామంలో తెలంగాణ చంద్రుడు ఏం చేయ‌నున్నారు.ఆ శాబ్దిక సౌంద‌ర్య ఛాయల్లో చంద్రుడు వెలుగు క‌లిశాక ఏమౌతుంది? ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌కు నాంది. వెలుగు క‌న్నా చీక‌ట్లే ఎక్కువ నిండి ఉన్న దేశాన ఇప్పుడు తెలంగాణ చంద్రుడు చ‌క్క‌ని ప్ర‌త్యామ్నాయం కావాల‌నుకోవ‌డంలో ఆశ ఉంది.

అది అత్యాశ అవునో కాదో అన్న‌ది ఇప్ప‌టికైతే తేల్చ‌లేం.ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు చివ‌రి ఘట్టంలో కేసీఆర్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు.పీకే డైరెక్ష‌న్ చేస్తుంటే అంతో ఇంతో కేజ్రీ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ను స‌స్టైన్ చేయాల‌ని త‌ప‌న ప‌డుతున్నారు.ఈ సినిమా పేరు వార‌ణాసి దారుల్లో తెలంగాణ చంద్రుడు..

ఒక‌టో రెండో మూడో కాదు కొన్ని ల‌క్షల మెరుపుల దాడి చేయాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంలానే ఉంది. కొంత‌లో కొంత ఇత‌ర పార్టీల నుంచి స‌మాచారం కూడా ఇందుకనే ఆయ‌న సేక‌రిస్తున్నారు.ముఖ్యంగా ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ మోడీ ఎలా ఉన్నార‌న్న‌దే కీల‌కం.

అందుకు త‌గ్గ స‌మాచారంతో పాటు కాశీ విశ్వేశ్వ‌రుడి చెంత తెలంగాణ చంద్రుడు చెప్పే మాట‌లే రేప‌టి వేళ అక్క‌డి ఓట‌ర్ల‌నూ ఆక‌ర్షింప‌జేయ‌వ‌చ్చు.ఆలోచింప‌జేయ‌నూవ‌చ్చు.ఇప్ప‌టికే కాంగ్రెస్ కొంత అక్క‌డి ఓట‌రును ఆక‌ట్టుకున్నా హిందుత్వ విష‌యంలో బీజేపీ చాలా అగ్ర‌భాగాన ఉంది.

అస‌లు ఈ ప్రాంతానికి సేవ చేసుకోవ‌డ‌మే సిస‌లు అదృష్టం అని సెంటిమెంట్ మాట‌లు చెప్పే మోడీని మించి కేసీఆర్ హిందీలో ఇంకా చెప్పాలంటే స్థానిక మాండ‌లికంలో మాట్లాడ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని కానీ ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని మాత్రం తీసిపారేయ్య‌లేం.త‌క్కువ చేయ‌లేం కూడా!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇంకా రెండు విడ‌త‌లు మిగిలే ఉన్నాయి. మార్చి 3 మ‌రియు మార్చి7 తేదీల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.ఇదే సంద‌ర్భంలో ఈ రెండు విడ‌త‌లూ కూడా ప్ర‌ధాన పార్టీల‌కు కీల‌కం కానున్నాయి.వీటిపై అయోధ్య రామాల‌యం అంశం అన్న‌ది కీల‌కం కానుంద‌ని విశ్లేష‌ణ‌లు అందుతున్నాయి.ఇదే స‌మ‌యంలో బీజేపీకి మ‌త వాద రాజ‌కీయ ప‌రంగా ఎప్ప‌టి నుంచో కౌంట‌ర్లు ఇస్తున్న కేసీఆర్ కూడా ఈ రెండు విడ‌త‌ల ఎన్నిక‌ల‌పైనే దృష్టి సారించారని కూడా తెలుస్తోంది.

ఏదో ఒక సంద‌ర్భంలో ఆయ‌న మాట్లాడ‌తార‌ని,ఆయా ప్రాంతాల‌లో ఆయ‌న ఎక్క‌డో ఓ చోట బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తార‌ని తెలుస్తోంది.ఆఖరి విడ‌త‌కు సంబంధించి కేసీఆర్ సీన్లోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.వార‌ణాసిలో ఈ నెల నాల్గున జ‌రిగే స‌మావేశానికి హాజ‌రై మాట్లాడ‌తార‌ని స‌మాచారం. వార‌ణాసి అంటే మోడీ అడ్డా..అక్క‌డికి పోయి యే బిడ్డా ఇది నా అడ్డా అని అన‌బోతున్నారు కేసీఆర్. అన‌బోవ‌డ‌మే కాదు అర‌వ‌బోతున్నారు కూడా!

ముందుగా హిందుత్వ రాజ‌కీయాల‌పైనే ఆయ‌న ఎక్కువ‌గా ఫోక‌స్ నిలప‌నున్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు న‌డ‌ప‌డంలో బీజేపీ ముందుంద‌ని,హిజాబ్ వివాదం కూడా అందుకేన‌ని,శాంతియుత ప్రాంతానికే ఎవ్వ‌రైనా వ్యాపారం చేసుకునేందుకు అయినా,లేదా చ‌దువుకునేందుకు అయినా వ‌స్తార‌ని గ‌తంలో కేసీఆర్ అన్నారు.

ఆ విష‌య‌మై తెలంగాణ దేశంలోనే ప్ర‌థ‌మ స్థానం ఉంద‌ని,ఇక్క‌డ మ‌త సామ‌రస్యం వెల్లివిరుస్తోంద‌ని కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతూ, మోడీ స‌ర్కారును దెప్పి పొడుస్తున్నారు.ఈ నేప‌థ్యంలో వార‌ణాసి కేంద్రంగా ఆయ‌న మాట్లాడే మాట‌లను దేశంలో కీల‌క పార్టీలు అన్నీ శ్ర‌ద్ధగా విన‌నున్నాయి.