Begin typing your search above and press return to search.

కేసీఆర్ : పీకే నేర్పునొక పాఠం..దేవుడై వ‌చ్చాడా !

By:  Tupaki Desk   |   1 March 2022 7:30 AM GMT
కేసీఆర్ : పీకే నేర్పునొక పాఠం..దేవుడై వ‌చ్చాడా !
X
దేవుడై వ‌చ్చాడా స్నేహ‌మై నిలిచాడా అన్న‌ది ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ విష‌య‌మై వినిపిస్తున్న మాట.మ‌రోసారి జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేందుకు,ప్రాంతీయం నుంచి జాతీయం వ‌ర‌కూ త‌నని తాను పరివ్యాప్తం చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.ఇందుకు ప్ర‌శాంత్ కిశోర్ అనే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త సాయం తీసుకుంటున్నారు.విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉంటూ, జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ఎదిగేందుకు త‌న‌వంతు సాయం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌లో చిర‌ప‌రిచితం అయిన ప్ర‌శాంత్ కిశోర్ గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌ర‌ఫున ప‌నిచేసి అనూహ్య విజ‌యాలు అందుకున్నారు.

అదేస్ఫూర్తితో ఇప్పుడు కూడా తాను ప‌నిచేయ‌నున్నాన‌ని ఆయ‌న అంటున్నారు.కేసీఆర్ కూడా ప్ర‌శాంత్ కిశోర్ కు మంచి ప్రాధాన్యం ఇవ్వాల‌నే అనుకుంటున్నారు.ఎందుకంటే ఇవాళ మోడీ ప్ర‌ధాని అయ్యేందుకు ఓ కార‌ణం అభివృద్ధి రీత్యా గుజ‌రాత్ మోడ‌ల్ ను దేశమంత‌టా అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.అందుకు త‌గ్గ విధంగా ఆరోజు అనుకూల మీడియాలో ప్ర‌చారం చేశారు. ఇప్పుడిదే సూత్రాన్ని తెలంగాణ‌కూ అనువ‌ర్తింప‌జేయాల‌ని కేసీఆర్ అనుకుంటున్నారు.తెలంగాణను తాను అభివృద్ధి చేసిన‌ప్ప‌టికీ అనూహ్య ఫ‌లితాలు ఆ దిశ‌గా అందుకున్న‌ప్ప‌టికీ అనుకున్న విధంగా ప్ర‌చారం చేయ‌లేక‌పోతున్నామ‌ని కేసీఆర్ భావిస్తున్నారు.ఇదే విష‌యం మొన్న‌టి వేళ పీకే ద‌గ్గ‌ర ప్ర‌స్తావించారు కూడా! యావ‌త్ ప్ర‌పంచ‌మే నివ్వెర పోయే విధంగా తాము తెలంగాణ‌లో మ‌ల్ల‌న్న సాగ‌ర్ ఎత్తిపోత‌ల ప‌థకాన్ని తీసుకువ‌చ్చి అమ‌లు చేశామ‌ని, దీనిపై ఫోక‌స్ చేయాల‌ని కూడా కోరారు.

విమ‌ర్శ‌లివి..వింటారా!

చంద్ర‌బాబును ఎదిరించి,రాజశేఖ‌ర్ రెడ్డి తో సైద్ధాంతిక విభేదాలు పెంచుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటుచేశారు కేసీఆర్.ఆ రోజు ఎన్నో ఒడిదొడుకులు ప‌డ్డారు.త‌రువాత ప‌డినా లేచారు. పార్టీకో జీవం ఇచ్చారు. ప్రాణం అయ్యారు. తెలంగాణ ఆత్మ‌ను కేసీఆర్ అర్థం చేసుకున్న విధంగా ఎవ్వ‌రూ అర్థం చేసుకోరు, కోలేరు కూడా! అన్నంత‌గా ఆయ‌న నాయ‌కుడిగా ఎదిగారు. ఆయ‌న‌తో పాటు ఇంకొంద‌రు కూడా ఆ ప్రాభ‌వాన్ని త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకున్నారు.ఉద్య‌మ పార్టీని కాస్త ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మ‌లిచి విజ‌య‌వంతం అయ్యారు. ఏడేళ్లలో అన్నీ కాక‌పోయినా కొన్ని విజ‌యాలు మాత్రం ఆయ‌న‌కు చిర‌స్మ‌ర‌ణీయ ఖ్యాతిని లేదా పేరును తెచ్చిపెట్టాయి.

ఇవ‌న్నీ మ‌రిచిపోయి ఒంట‌రిగా నాయ‌కుడిగా ఎదిగిన వైనాన్ని మ‌రిచిపోయి ఆయ‌న ఇప్పుడిలా పీకే లాంటి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌ను న‌మ్ముకోవ‌డం ఏ విధంగానూ మంచిది కాదు అని కేసీఆర్ అభిమానులే అంటున్నారు అని స‌మాచారం.

ఎందుకంటే పీకే వ‌ల్ల చాలా ప్ర‌మాదాలు ఉంటాయి. ముఖ్యంగా ఉచిత ప‌థ‌కాల పేరిట లేనిపోని భ్ర‌మ‌లు క‌ల్పింప‌జేయ‌డంలో ఆయ‌న దిట్ట.దీని వ‌ల్ల ఖ‌జానాకు భారం అని చెప్పిన ఓట్ల వేట‌లో ఇవి త‌ప్ప‌వు అని మైమ‌రిపిస్తారు ఆయ‌న.అదేవిధంగా అవ‌స‌రం ఉన్నా లేకున్నా సెంటిమెంట్ రాజ‌కీయాలు న‌డిపిస్తారు ఆయ‌న.ఈ రెండూ దాటి పీకే ఏ ఆలోచ‌నా చేయ‌రు. చేయ‌లేరు అన్న విమ‌ర్శ కూడా ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకునే పీకే ట్రాప్ లో కేసీఆర్ ప‌డిపోవ‌ద్ద‌ని శ్రేయోభిలాషులు హెచ్చ‌రిస్తున్నారు.క‌నుక ఆయన దేవుడై దిగివ‌చ్చాడా? స్నేహ‌మై నిలిచాడా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది. ఎందుకంటే జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ఇప్ప‌టికే ఓ విఫ‌ల స్వాప్నికుడు.