Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ‌దిలితే.. నీవెంట‌ మేం రాం!: జ‌గ్గారెడ్డికి తేల్చి చెప్పేశారు!

By:  Tupaki Desk   |   25 Feb 2022 10:30 AM GMT
కాంగ్రెస్ వ‌దిలితే.. నీవెంట‌ మేం రాం!:  జ‌గ్గారెడ్డికి తేల్చి చెప్పేశారు!
X
గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ క‌ప్పులో తుఫాను మాదిరిగా రెచ్చిపోతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌ జగ్గారెడ్డి వ్యవహారం మ‌రోసారి ఆస‌క్తి గా మారింది. ఆయ‌న పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌పై ఫైర‌వుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఏకంగా ఆయ‌న పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యారంటూ.. వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు.. ఆయ‌న ఇంటికి వెళ్ల‌డం.. ఆయ‌న‌తో చ‌ర్చించ‌డం.. ఆయ‌న కొంత బెట్టుకుపోవ‌డం తెలిసిందే. ఈ వివాదం ఇలా సాగుతున్న స‌మ‌యంలోనే.. జ‌గ్గారెడ్డి త‌న అనుచ‌రుల‌తో భేటీ అయ్యారు.

కార్య‌క్త‌ల‌తో భేటీ అయిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు ఒక విష‌యం స్ప‌ష్టంగా తేలింద‌ని అంటున్నారు. అదేంటం టే... కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను కాంగ్రెస్‌లోనే ఉండాల‌ని కోరుతున్నారు. కాంగ్రెస్‌ను కాదంటే.. తాము వ‌చ్చేది లేద‌ని.. జ‌గ్గారెడ్డికి తేల్చి చెప్పార‌ట‌. ``మీరు ఉంటే కాంగ్రెస్‌నే ఉండాలి. లేక‌పోతే.. మీము మీ వెంట వ‌చ్చే ది లేదు`` అని బ‌ల్ల‌గుద్దిన‌ట్టు చెప్పార‌ట‌. అంతేకాదు.. మీరు టీఆర్ ఎస్‌లోకి చేరినా.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. బీజేపీలో చేరినా.. మేము వ‌చ్చేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల్సిన అవ‌స రం ఉంద‌ని.. దీనికి క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాలని.. దీనికి తాము కృషి చేస్తామ‌ని చెప్పారు. అంతే త‌ప్ప‌.. కాంగ్రెస్‌ను చీల్చినా.. ఆ ప్ర‌య‌త్నం చేసినా.. తాము ఊరుకునేది లేద‌ని తేల్చేశార‌ట‌. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు గ‌ట్టిగా కృషి చేద్దామ‌ని అన్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డి ఏం చేస్తారో చూడాలి.

ఇదిలావుంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేచి చూస్తున్నారు. జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చింద ని.. సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారని ఇటీవ‌ల ఆయ‌న‌చెప్పిన విష‌యం తెలిసిందే. సోష ల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్లు వచ్చాయని కుంగిపోవద్దని సూచించారు.

మూడు రోజుల నుంచి జగ్గారె డ్డి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అంతా జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇప్పుడు ఆయ‌న అనుచ‌రులు కూడా కాంగ్రెస్‌లోనే ఉండాలంటూ.. గ‌ట్టిగా తేల్చి చెప్పేయ‌డంతో ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. జ‌గ్గారెరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.