Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ : తాకట్టులో భార‌త్ అప్పుల్లో ఆంధ్ర నిజ‌మేనా !

By:  Tupaki Desk   |   16 March 2022 7:30 AM GMT
ప‌వ‌న్ : తాకట్టులో భార‌త్ అప్పుల్లో ఆంధ్ర నిజ‌మేనా !
X
డ‌బ్బుల‌న్నీ ఏమ‌యిపోతున్నాయో తెలియడం లేదు. భార‌త్ లో విదేశీ పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఎలా ఉందో కూడా తెలియ‌డం లేదు. కరోనా పుణ్య‌మాని పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఆగిపోయి చాలా కాలం అయింది. పోనీ చంద్ర‌బాబు హ‌యాంలో వ‌ర‌ల్డ్ బ్యాంకును తిట్టిన విధంగా ఇప్పుడు ఎవ్వ‌రినీ ఏ అంత‌ర్జాతీయ బ్యాంకర్ నూ తిట్ట‌లేం. వ‌ర‌ల్డ్ ఎకాన‌మి ప‌ర‌మ ద‌రిద్రంగా ఉంది. చైనా వ‌స్తువులే కొనండి అన్న వాద‌న కొట్టుకుపోయి చాలా కాలం అయింది. ర‌ష్యా,ఉక్రెయిన్ యుద్ధ ప‌రిణామాల రీత్యా ధ‌ర‌లు పెరుగుతున్నాయే త‌ప్ప భార‌త్ కు కొత్త‌గా ప్రాణ సంక‌టం ఏమీ లేదు.

ఈ ద‌శ‌లో తాక‌ట్టులో భార‌త‌దేశం ఉంద‌ని చెప్ప‌గ‌ల‌మా.. స్వ‌దేశీ శ‌క్తులే దేశాన్ని అర్థం చేసుకోక దేశ ఆర్థిక గ‌మనాన్ని మార్చ‌లేక చతికిల ప‌డిపోతున్న సంద‌ర్భాన విదేశీ శ‌క్తులు ఇక్క‌డికి వ‌చ్చి త‌మ హ‌వా నెర‌పేందుకు ఇప్పుడున్న వేళ‌లు ఓ విధంగా అనుకూల‌మేనా? ఎందుకంటే ఆర్థిక మాంధ్యం పుణ్య‌మాని ప్ర‌పంచం మొత్తం త‌ల‌కిందులు అయి ఉంది.

కొన్నింటిపై ప‌ర‌స్ప‌ర ఆధారిత ప‌ర్వంలో భాగంగా రేట్లు పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలోకొన్ని త‌గ్గి వ‌స్తున్నాయి కూడా! ఈ క్ర‌మంలో దేశాన్ని కార్పొరేట్ శ‌క్తులు నాశ‌నం చేస్తున్నాయి అని చెప్పే పెద్ద‌లు కూడా ఆఖ‌రికి వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. క‌నుక తాక‌ట్టులో భార‌త్ అన‌డంలో అర్థం లేదు కానీ కొన్నింటి ప్ర‌భావం మాత్రం ధ‌ర‌ల న‌డ‌క‌పై లేదా ప‌రుగులపై ఉంద‌న్న‌ది ఓ వాస్త‌వం.

ఇక అప్పుల్లో ఆంధ్ర..ఇది మాత్రం నిజం. ఓవిధంగా ఏడు ల‌క్ష‌ల కోట్లలో మూడున్న‌ర కోట్ల అప్పు టీడీపీ చేసిందేన‌ని వైసీపీ అంటోంది. అది ఐదేళ్ల అప్పు. కేంద్రం దండీగా నిధులిచ్చినా కూడా స‌రిపోని రోజున చేసిన అప్పు.కరోనా ఫేజెస్ లేని రోజుల‌లో చేసిన అప్పు. కానీ ఆ రోజుతో పోలిస్తే ఈ రోజు ప‌ర‌మ ద‌రిద్రంగా ఆదాయం ఉంది. జీఎస్టీ వ‌సూళ్లు బాగున్నా కేంద్రం తిరిగి ప‌న్ను స‌ర్దుబాటు నిధుల్లో భాగంగా రాష్ట్రానికి ఇస్తున్న‌ది ఏమీ లేదు. ఉన్నాకూడా నిబంధ‌న‌లు మ‌రియు జ‌నాభా ఆధారంగానే నిధుల కేటాయింపు ఉంటుంది.

ఇదే స‌మ‌యంలో ఉత్త‌రాదికి జ‌రిగే కేటాయింపులు అన్న‌వి మ‌నకు రుచించ‌కున్నా వాళ్ల‌దే రాజ్యం క‌నుక సొమ్ముల‌న్నీ అటే వెళ్తాయి. కనుక మూడేళ్ల పాల‌న (సుమారు) ఫ‌లితం మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల అప్పు అని టీడీపీ మ‌రియు జ‌న‌సేన చెబుతున్న మాట.ఈ ద‌శ‌లో ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ఆంధ్రాను రుణ విముక్తం చేస్తామ‌ని అంటున్నారు ప‌వ‌న్.

ఎలా చేస్తారో మాత్రం నిన్న‌మొన్న‌టి వేళ వివ‌రించ‌రు. పోనీ రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఒడ్డెక్కించేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చినా అవ‌న్నీ త్వ‌ర‌త్వ‌ర‌గా తేలే విష‌యాలే కావు.అందుక‌ని ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ లో ఫ‌స్ట్ ఫేజ్ అంటే తాక‌ట్టు లో భార‌త్ త‌ప్పు..అప్పుల్లో ఆంధ్రా అన్న‌దే రైటు.