Begin typing your search above and press return to search.

అన్ని కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్న కేంద్రం

By:  Tupaki Desk   |   24 March 2022 5:32 AM GMT
అన్ని కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్న కేంద్రం
X
దేశంలో అమలులో ఉన్న కోవిడ్ నిబంధలను ఈ నెల 31వ తేదీ నుంచి కేంద్రం ఎత్తేస్తోంది. అయితే మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం అనే నిబంధనలను మాత్రం కంటిన్యు చేయబోతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గిపోతున్న నేపధ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. కాకపోతే ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్ధితులను సమీక్షిస్తుంటుంది.

దేశంలో మహమ్మారిని కట్టడిచేసేందుకు 2020, మార్చి 24వ తేదీన విపత్తు నిర్వహణ చట్టం-2005ని కేంద్రం దేశవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి తెచ్చింది. అప్పటినుండి మార్గదర్శకాల్లో అనేక మార్పులు చేస్తూ వైరస్ తీవ్రతను, కేసుల పెరుగుదల, తగ్గుదలను రెగ్యులర్ గా సమీక్షిస్తోంది. దేశంలో వైరస్ తీవ్రత బాగా తగ్గిపోయిన కారణంగా అప్పట్లో రూపొందించిన అనేక మార్గదర్శకాలను, నియమ, నిబంధలను ఈనెల 31 నుండి ఎత్తేస్తున్నట్లు హోంశాఖ అజయ్ భల్లా ప్రకటించారు.

ఒకవేళ మళ్ళీ కేసుల సంఖ్య పెరిగితే సమస్యలు తలెత్తకుండా కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వాలు కంటిన్యు చేయాలని ఆదేశించారు. కోవడ్ రోగులు వచ్చినపుడు ట్రీట్మెంట్ చేయటానికి వీలుగా అవసరమైన అన్నీ మందులను అందుబాటులో ఉంచుకోవాలని కూడా అజయ్ భల్లా చెప్పారు. రేపు జూలైలో ఫోర్త్ వేవ్ రాబోతోందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తులు హెచ్చరిస్తున్నారు. కొందరేమో అదేమంత సీరియస్ వ్యవహారం కాదంటున్నారు.

కానీ కొందరేమో ఫోర్త్ వేవ్ చాలా తీవ్రంగా ఉండబోతోందని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జనాల్లో అయోమయమైతే కంటిన్యూ అవుతోంది. ఇక మాస్కులు విషయం చూస్తే చాలామంది ధరించటం లేదనే చెప్పాలి. చేతులను శుభ్రం చేసుకోవటం అనేది వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరు దానిపై నిఘా పెట్టలేరు. అలాగే భౌతిక దూరం పాటించటమన్నది మనదేశంలో జరిగే పనికాదు. కరోనా బాగా ఉన్నరోజుల్లోనే జనాలు భౌతిక దూరం పాటించలేదు. సరే ఏదేమైనా ఈనెల 31వ తేదీ నుండి కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఎలాగుంటుందో చూడాల్సిందే.