Begin typing your search above and press return to search.

వివేకా కేసు విషయంలో డీజీపీ ఏమన్నారంటే... ?

By:  Tupaki Desk   |   1 March 2022 12:30 PM GMT
వివేకా కేసు విషయంలో  డీజీపీ ఏమన్నారంటే... ?
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇపుడు సీబీఐ దర్యాప్తులో ఉంది. మరో వైపు చూస్తే దీని మీద గతంలో సీబీఐ కొందరు కీలక వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్న వాంగ్మూలాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి.

మీడియాలో అవి పెద్ద ఎత్తున హైలెట్ అవుతున్నాయి. అలాగే పెను సంచలనం రేపుతున్నాయి. దాంతో ఏపీలో పొలిటికల్ ఫోకస్ అంతా కూడా వివేకా హత్య మీదనే ఉంది.

ముఖ్యంగా టీడీపీ దీని మీదనే వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి కౌంటర్లు ఉంటున్నాయి. ఇక డీజీపీగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా విశాఖ వచ్చిన రాజేంద్రనాధ్ రెడ్డి వివేకా హత్య కేసు విషయంలో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోంది, ఈ కేసు విచారణ విషయంలో ఏపీ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసు విషయంలో ఏపీ పోలీసుల మీద ఎవరి వత్తిళ్ళూ ఎటువైపు నుంచి కూడా లేనే లేవని అన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సాగుతున్న దశలో ఎవరైనా మాట్లాడ‌డం సరైనది కాదని అన్నారు.

ఇక విశాఖ ఒడిషా సరిహద్దుల్లో గంజాయి సాగు నిరోధానికి ఒడిషాతో కలసి జాయింట్ ఆపరేషన్ చేపడతామని డీజీపీ చెప్పారు. అక్రమ గంజాయి విషయంలో ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేశారు. ఏపీలో డ్రగ్స్ అక్రమ రవాణా వినియోగం మీద కూడా నిఘా ఉంటుందని అన్నారు.

ఏపీలో సైబర్ క్రైమ్ రేటు తక్కువగానే ఉందని అన్నారు. విశాఖ సిటీలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందని, దాని నివారణకు చర్యలు చేపడున్నట్లుగా రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పుకొచ్చారు.