Begin typing your search above and press return to search.

శ్రీ‌వ‌ల్లీ వ్యామోహంలో ముంబై పోలీసులు!

By:  Tupaki Desk   |   16 March 2022 4:16 AM GMT
శ్రీ‌వ‌ల్లీ వ్యామోహంలో ముంబై పోలీసులు!
X
శ్రీ‌వ‌ల్లి పై ముంబై పోలీసుల ప్రేమ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఖాకీల మ‌దిలోనూ ప్రేమ ప‌ల్ల‌వించేలా చేసిందంటే శ్రీ‌వ‌ల్లి మ‌హ‌త్తును అంచ‌నా వేయొచ్చు. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా పుష్ప శ్రీ‌వ‌ల్లి గీతం ఎంతో పాపుల‌రైంది. దీనికి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా అనుక‌ర‌ణ‌లు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. అటు ప్ర‌పంచ‌వ్యాప్త క్రికెట‌ర్ల‌లోను.. ప్ర‌ముఖ స్టార్ల‌లోను ఇది సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ శ్రీ‌వ‌ల్లి సిగ్నేచ‌ర్ స్టెప్ వీడియోని షేర్ చేసేందుకు ఉత్సాహం చూపించారు.

బ‌న్ని ల్యాండ్ మార్క్ స్టెప్ తో పాటు.. దేవీశ్రీ రాకింగ్ మ్యూజిక్ కూడా ఇందుకు కార‌ణం. తాజాగా ముంబై బ్యాండ్ ఖాకీ స్టూడియో శ్రీ‌వ‌ల్లి వ్యమోహంలో ప‌డిపోయింది. ఖాకీ స్టూడియో అని పిలువబడే ముంబై పోలీసుల బృందం పుష్పలోని శ్రీవల్లి పాటను ప్రదర్శిస్తున్న వీడియో యూట్యూబ్ లో వైర‌ల్ గా మారింది. సామాజిక మాధ్య‌మాల్లో పుష్ప: ది రైజ్ చిత్రం నుండి శ్రీవల్లికి సంబంధించిన కనీసం ఒక్క పోస్ట్ అయినా ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక మాధ్య‌మాల్లో చూసే అవకాశం ఉంది.

ప్రజలు ఈ పాట‌పైనా సినిమాపైనా విభిన్న పోస్ట్ లను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తూనే ఉన్నారు ఇంకా. ఖాకీ స్టూడియో అని పిలుచుకునే ముంబై బ్యాండ్ అద్భుతమైన ప్రదర్శనతో అద‌ర‌గొట్ట‌గా ఇప్పుడు ముంబై పోలీసులు ట్రెండ్ లో చేరారు. ఖాకీ బ్యాండ్ పనితీరు అంద‌రినీ మెప్పిస్తోంది.

ఈ వీడియోను ముంబై పోలీసులు తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ``ముంబయి పోలీస్ బ్యాండ్ ద్వారా శ్రీవల్లి సంగీత ప్రాతినిధ్యం`` అని క్యాప్ష‌న్ కూడా రాశారు. “#KhakiStudio రుఖేగా నహీ! ముంబైవాసులు శ్రీవల్లి పాటలకు ఊగిపోవడం గమనించి అందులో చేరాలని నిర్ణయించుకున్నాం! అంటూ ఫ‌న్నీగా జోక్ చేశారు.

కొన్ని రోజుల క్రితం వీడియో పోస్ట్ చేయబగా ఇప్ప‌టికే క్లిప్ 8400 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. వీడియోని చూసేవారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. షేరింగులు అవుతోంది. దీనిపై ర‌క‌ర‌కాలుగా ప్రశంసనీయమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడానికి ప్రజలను ప్రేరేపించింది ఈ వీడియో. ``సూపర్ అద్భుతం..`` అని ఒక యూట్యూబ్ వినియోగదారు రాశారు.

మరికొందరు అద్భుతం అని వ్యాఖ్యానించడం ద్వారా తమ స్పంద‌న‌ను వ్యక్తం చేశారు. వావ్ మరొకరు వ్యాఖ్యానించారు. అద్భుతమైన! శెభాష్! గొప్ప సింఫొనీ.. బాగా ఆడారు... మా పోలీస్ టీమ్ కి ఇంత టాలెంట్స్ ఉంద‌ని మాకు ఎప్పుడూ తెలియదు!! అని ఒక‌రు వ్యాఖ్యానించారు. సూపర్-డూపర్ పెర్ఫార్మెన్స్ ..గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియో వైర‌ల్ గా మారింది.