Begin typing your search above and press return to search.

పండుగ రోజున నాన్ వెజ్ గోల.. జెఎన్ యు క్యాంపస్ లో ఈ రచ్చేంది?

By:  Tupaki Desk   |   11 April 2022 5:47 AM GMT
పండుగ రోజున నాన్ వెజ్ గోల.. జెఎన్ యు క్యాంపస్ లో ఈ రచ్చేంది?
X
నిత్యం మానవ హక్కులు.. మనోభావాలు.. లాంటి మాటలు మాట్లాడే సంస్థలు సమన్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి.. తమ పిడివాదననను వినిపిస్తూ.. మనోభావాలు.. భావోద్వేగాలు కొందరికి మాత్రమే ఉంటాయని.. మిగిలిన వారికి ఉండవన్నట్లుగా కొందరు మేధావుల తీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిష్ఠాత్మక ఢిల్లీ జేఎన్ యూలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ముక్కున వేలేసుకోవాలి.

శ్రీరామ నవమి పండుగ రోజులన విద్యార్థుల్లో పలువురు భక్తి భావంతో పూజలు చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న వేళ.. అందుకు భిన్నంగా పండుగ వేళలోనూ తమకు నాన్ వెజ్ ఇవ్వాలన్న కొందరు వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులు చేసిన రచ్చ ఇప్పుడు షాకింగ్ గా మారింది. జేఎన్ యూ క్యాంపస్ లో రెండు గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. ఒక గ్రూపు రైట్ వింగ్ అయితే.. మరొకటి లెఫ్టు వింగ్. రైట్ వింగ్ బీజేపీకి.. సంఘ్ పరివార్ కు మధ్య తరచూ ఏదో ఒక అంశం మీద వాదనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.తాజాగా శ్రీరామనవమిని ఫురస్కరించుకునే వేళలో క్యాంపస్ లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉంటే.. పండుగ పూట కూడా మామూలు భోజనమే ఎందుకు పెడతారని.. నాన్ వెజ్ ఆహారం కావాలంటూ మిగిలిన వారిని రెచ్చగొ్ట్టే ప్రయత్నం చేశారు. దీంతో.. అప్పటివరకు కాస్తంత ఉద్రిక్తంగా ఉన్న క్యాంపస్ ఒక్కసారి మారిపోయింది. ఇరు వర్గాల మధ్య గొడవ కాస్తా.. దాడుల వరకు వెళ్లటం.. ఇరు వర్గాల వారు కొట్టుకున్న వైనంతో దాదాపు యాభై నుంచి అరవై వరకు విద్యార్థులు ఈ దాడుల్లో గాయపడ్డారు. గొడవ తీవ్రత ఎక్కువ కావటంతో పోలీసులు క్యాంపస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పరిస్థితిని కంట్రోల్ కు తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

క్యాంపస్ లో ఈ తరహా ఉదంతాలపై మండిపాటు వ్యక్తమవుతోంది. భావోద్వేగాలు.. మనోభావాల గురించి అదే పనిగా మాట్లాడే వామపక్షవాదులు.. పండుగ పూట నాన్ వెజ్ లేకపోతే ఏమవుతుంది? అని ప్రశ్నిస్తున్నారు. పండుగ వేళ ప్రత్యేక పూజను నిర్వహించాలనుకునే వారి మనోభావాలు పరిగణలోకి తీసుకోరా? అన్నది ప్రశ్నగా మారింది.

ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై తరచూ లెక్చర్లు ఇచ్చే వామపక్ష వర్గీయులు.. ఎదుటి వారి మనోభావాల్ని గౌరవించాలన్న ఇంగితం లేకపోవటం ఏమిటి? అంటూ పలువురు విరుచుకుపడుతున్నారు. అందరికి తెలిసిన పండుగ రోజున నాన్ వెజ్ లేకుంటే ప్రాణాలు పోతాయా? ప్రత్యేక రోజును కూడా ఏదో రకంగా గోల చేయటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వాటికి చికిత్స ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.