Begin typing your search above and press return to search.

కామదహనం అంటే ఏమిటి..? దీనిని ఎందుకు జరుపుకుంటారు..?

By:  Tupaki Desk   |   17 March 2022 6:28 AM GMT
కామదహనం అంటే ఏమిటి..? దీనిని ఎందుకు జరుపుకుంటారు..?
X
రంగుల కేళీ హోలీ ప్రతి సంవత్సరం వస్తుంది. ఎప్పటి లాగే ఒకరికొకరు రంగులు చల్లుకుంటారు.. డ్యాన్సులతో హుషారుగా ఉంటారు. అయితే చాలా మంది హోలీ పండుగ అనగానే రంగలు చల్లుకోవడం అని మాత్రమే అనుకుంటారు. హోలీ పండుగ వెనుక పెద్ద కథే ఉంది. అలాగే హోలీ పండుగ ఒక రోజు ముందు కామదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులను తీసుకొచ్చి కూడళ్లలో వేసి దహనం చేస్తారు. దీనినే కామదహనం అంటారు. ఇంతకీ కామదహనం ఎందుకు నిర్వహిస్తారు..? అసలు హోలీ పండుగ చరిత్ర ఏమిటి..?

కామదహనం అంటే.. శరీరంలో ఉన్నా కామాన్ని దహించడం. పురాణాల ప్రకారం శివుడు ఘోర తపస్సులో మునిగిపోతాడు. ఈ సమయంలో శివుడితో ఏకాగ్రత కోసం తపస్సును భంగం చేయాలని కామదేవుడిని కోరుతుంది. దీంతో కామదేవుడు శివుడి తపస్సులను భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శంకరుడు తన త్రినేత్రంతో కోపోద్రిక్తుడై కామదేవుడి శరీరాన్ని భస్మం చేస్తాడు. అయితే కామదేవుడి భార్య రతి దేవి తన భర్తను బతికించాలని శివుడిని ఆరాధిస్తుంది. దీంతో శివుడు శాంతించి కామదేవుడికి పునర్జన్మనిస్తాడు. ఇలా కామదేవుడిని దహనం చేసిన దానికి గుర్తుగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇక రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించి ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.. ఇలా రంగులు చల్లుకోవడం వెనకా ఓ కథ ఉంది. హిరణ్య కశపుడి చెల్లెలు అయిన హోలిక రాక్షసి చనిపోవడం వల్ల ఆమె బాధల నుంచి విముక్తి అయిన ప్రజలు సంతోషంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలిక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ హోలిక మహోత్సవమే నేటి హోలి పండుగలా మారింది.

అయితే హోలీ పండుగ వెనక మానవ జీవితానికి ఒక సందేశం బోధపడుతుంది. కాముడు ప్రతి వ్యక్తిలో కనిపిస్తాడు. అంతర్లీనంగా ఉండి అరిష్టాశ్వర్యైలైన రాగ, ధ్వేష, కమా, క్రోధ, మోహ, మాయ లాంటి గుణాలను ప్రజ్వరిల్లజేస్తాడు.అయితే వీటిని అదుపులో పెట్టుకునేందుకు ధ్యానం మార్గం ఎంచుకోవాలని ఈ పండుగ చెబుతుంది. మనిషిలో కోరికలు విపరీతంగా పెరిగితే జరిగే నష్టాలనే ఇది చెబుతుంది. ప్రతి మనిషిలో ఎన్నో గుణాలుంటాయి. కానీ వాటన్నింటిని సరైన మార్గంలో నడిపించేందుకు ధ్యానమనే దారిలో వెళ్లాలని సూచిస్తుంది.

భారతదేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు నిర్వహించుకుంటారు. ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతాలను భట్టి పండుగ జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ద్వారా మనుషుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయని అంటారు. అలాగే ప్రేమ, సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. ఒక హోలీ పండుగను కొన్ని ప్రాంతాల్లో డోలోత్సవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో, రంగులతో ఉత్సవాన్ని నిర్వహించుకున్నట్లు పురాణాల్లో ఉంది.