Begin typing your search above and press return to search.

ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. కొత్త ఎన్ని కేసులంటే?

By:  Tupaki Desk   |   14 Jan 2022 7:55 AM GMT
ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. కొత్త ఎన్ని కేసులంటే?
X
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య వందలు, వేలు దాటి లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు నెలకొంటుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 12లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా ఒక్కరోజులోనే 2లక్షల 64వేల 202మంది కరోనా బారిన పడ్డారు. అంతకముందు రోజు 6.7శాతం అధికంగా కరోనా కేసులు నమోదుకాగా రోజు వారీగా పాజిటివ్ రేట్ 14.78 శాతానికి చేరుకుంది. అలాగే దేశ వ్యాప్తంగా ఒమ్రికాన్ కేసులు 5వేల753కు చేరింది. కరోనాకు తోడుగా ఒమ్రికాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, కేరళలలో ఒమ్రికాన్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3కోట్ల 65లక్షల మంది కరోనా బారిన పడగా 3.48కోట్ల మంది రికవరీ అయ్యారు. నిన్న ఒక్క రోజు లక్షమంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రివవరీ 95.20 శాతానికి చేరకుంది. గడిచిన 24 గంటల్లో 315మంది కరోనాతో పడగా ఆ సంఖ్య మొత్తంగా 4లక్షల85వేలకు చేరింది.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ లో డెల్లా వేరియంట్ కారణంగా భారత్ లో 2లక్షల40వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమతి తన నివేదికలో వెల్లడించింది. డెల్టా వేరియంట్ వల్ల భారత్ కు ఆర్థఇకంగా భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. రానున్న రోజుల్లోనూ ఇలాంటి పరిస్థితులు మరింత ఎదురుకాన్నాయని హెచ్చరించింది.

మరోవైపు భారత్ లో ఒమ్రికాన్ కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. నిన్న ఒక్క రోజు 73లక్షల మంది వ్యాక్సినేషన్ చేశారు. దేశంలో ఇప్పటి వరకు 155కోట్లకు పైగా డోసులను ప్రభుత్వం పంపిణీ చేసినట్లు చెబుతోంది. ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తోంది.