Begin typing your search above and press return to search.

నగ్న వీడియోతో వ్యాపారి నుంచి రూ.కోట్ల దోపిడీ!

By:  Tupaki Desk   |   13 Jan 2023 4:30 PM GMT
నగ్న వీడియోతో వ్యాపారి నుంచి రూ.కోట్ల దోపిడీ!
X
మీ నగ్న వీడియో మా వద్ద ఉందని.. తాము చెప్పినంత నగదు ఇవ్వకపోతే ఆ వీడియోను బయటపెడతామంటూ బెదిరించి ఓ వ్యాపారి నుంచి 11 మంది రూ.2.69 కోట్లు దోచుకున్న వైనం హాట్‌ టాపిక్‌ గా మారింది. గుజరాత్‌ లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారికి గత ఏడాది ఆగస్టు 8న మోర్బికి చెందిన రియా శర్మ పేరిట ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఈ క్రమంలో ఆమె వ్యాపారికి వీడియో కాల్‌ చేసి అతడి నగ్న దృశ్యాలను రికార్డు చేసింది. ఆ తర్వాత తన నిజ రూపాన్ని బయటపెట్టింది. ఈ వీడియోను బయటపెట్టకుండా ఉండాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని బెదిరింపులకు దిగింది. దీంతో బాధితుడు భయపడ్డాడు. ఆమె అడిగినట్టు డబ్బులు చెల్లించాడు.


ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. కొన్ని రోజులకే మళ్లీ ఆ గుజరాత్‌ వ్యాపారికి ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తనను తాను ఢిల్లీ ఇన్‌స్పెక్టర్‌ శర్మగా పరిచయం చేసుకున్నాడు. మీ వీడియో క్లిప్‌ తన వద్ద ఉందని చెప్పి.. వ్యాపారి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు.

మళ్లీ ఆగస్టు 14న ఇంకొకరు గుజరాత్‌ వ్యాపారికి ఫోన్‌ చేశాడు. తాను ఢిల్లీ పోలీసు సైబర్‌ సెల్‌ సిబ్బందినని పరిచయం చేసుకున్నాడు. రియా శర్మ ఆత్మహత్యకు యత్నించిందని వ్యాపారికి తెలిపారు. ఆ నగ్న వీడియో కాల్‌ దీనికి కారణమని వ్యాపారిని భయపెట్టాడు. కేసు మాఫీ చేయాలంటూ వ్యాపారి వద్ద నుంచి ఏకంగా రూ.80.97 లక్షలు దండుకున్నాడు.


ఈ వ్యవహారం ఇక అక్కడితో ఆగిపోతుందని గుజ రాత్‌ వ్యాపారి భావించాడు. అయితే మళ్లీ కొన్నాళ్లకు సీబీఐ అధికారినంటూ మరో వ్యక్తి వ్యాపారికి ఫోన్‌ చేశాడు. ఈ వ్యవహారంపై రియా శర్మ తల్లి సీబీఐని ఆశ్రయించిందని భయపెట్టాడు. కేసు మాఫీ చేయాలంటే రూ.8.5 లక్షలు తనకు ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో బాధితుడు అతడు అడిగినంత ముట్టజెప్పాడు.


ఈ నేపథ్యంలో డిసెంబరు 15న కేసు మూసివేసినట్లు ఢిల్లీ హైకోర్టు పేరిట గుజరాత్‌ వ్యాపారికి నకిలీ ఉత్తర్వులు అందాయి. అయితే వీటిపై వ్యాపారికి అనుమానం రావడంతో.. జనవరి 10న అతడు సైబర్‌ క్రై మ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగ్న వీడియో కాల్‌ తో బెదిరించి రూ.2.69 కోట్లు కాజేశారంటూ మొత్తం 11 మందిపై ఫిర్యాదు అందజేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.