Begin typing your search above and press return to search.

జ‌గ్గా రెడ్డి సంధించాడు... `ఒక రోజు` అది ఏందంటే!

By:  Tupaki Desk   |   21 Feb 2022 8:30 AM GMT
జ‌గ్గా రెడ్డి సంధించాడు... `ఒక రోజు` అది ఏందంటే!
X
తెలంగాణ‌కు చెందిన కీల‌క కాంగ్రెస్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌, జ‌గ్గారెడ్డి తాజాగా రాజ‌కీయ కాక పుట్టించిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తాన‌ని... ఇక‌పై ఉండ‌బోన‌ని ఆయ‌న‌సంచ‌ల‌న రేపారు. ఇంత‌లోనే సీనియ‌ర్ నేత‌లు వీహెచ్ స‌హా ప‌లువురు ఆయ‌న‌ను క‌లిసి.. బ్ర‌తిమాల‌డం.. త‌ర్వాత‌.. ఆయ‌న త‌న వాగ్దానాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. మ‌ళ్లీ ఏమైందో ఏమో.. త‌న రాజీనామాకే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు.. ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే.. ఆయ‌న ఒక‌ష‌ర‌తు పెట్టారు. దీంతో ఇప్పుడు జ‌గ్గా రెడ్డి విష‌యం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో జ‌గ్గారెడ్డి సొంత పార్టీపైనేతీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌ని.. హైక‌మాండ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. కొన్ని సార్లు.. రాష్ట పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్య‌తిరేక‌తతో ఏదో చేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది.

అయితే.. ఇంత జ‌రుగుతు న్నా.. జ‌గ్గామీద సానుభూతి రావ‌డం లేదు. ఎందుకంటే.. ఆయ‌న ప్ర‌భుత్వంపై ఎక్క‌డా ఒక్క మాట అన‌డం లేదు. పైగా.. పార్టీలైన్ మేర‌కు అయినా.. ప్ర‌బుత్వ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌పైనా .. ఆయ‌న నోరు క‌దిలించ‌డం లేదు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై ఒక్క మాటంటే.. ఒక్క‌టి కూడా అన‌డం లేదు.

దీంతో జ‌గ్గారెడ్డిపై న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింద‌ని.. దీనివ‌ల్ల ఆయ‌న‌కు చేకూరే ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పైగా జ‌గ్గారెడ్డి చేసే కామెంట్ల వ‌ల్ల‌.. టీఆర్ ఎస్ కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు కాదా? అని కాంగ్రెస్ నేత‌లు కూడా అంటున్నారు. మొత్తానికి జ‌గ్గారెడ్డి సాఆధించింది ఏందంటే.. ఒక రోజు మీడియా ఆయ‌న వైపు తిప్పుకొని కాంగ్రెస్ వృద్ధ నాయ‌కులను ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకున్నారు.

ఒక కాంగ్రెస్ నాయ‌కుడు అయితే... జ‌గ్గారెడ్డిఏదో కాంగ్రెస్‌కు రిజైన్ చేస్తున్నా.. అన్న‌ట్టుగా కాళ్ల‌కు దండం పెట్టి.. ప‌దే ప‌దే.. టీవీలో చూపించుకున్నాడు త‌ప్పితే.. సాధించింది ఏమీ లేదు. ఆయ‌న టీఆర్ ఎస్ మీద ఫైట్ చేసి ఉంటే.. జ‌గ్గారెడ్డికి స‌పోర్టు చేస్తామ‌ని.. కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.

ఎంత‌సేపూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే.. కాంగ్రెస్ వీక్ అవుతుంది కానీ.. కాంగ్రెస్ ఎలా బాగు ప‌డుతుంది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. క‌నీసం ఈ మాత్రం లాజిక్ ఆయ‌న‌కు తెలియ‌దా? అనేది సందేహం.

నిజానికి జ‌గ్గారెడ్డి చాలా సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే కూడా. అయితే.. ఆయ‌న కూడా గ‌తంలో టీఆర్ ఎస్ నుంచి, బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు వ‌చ్చారు. అదేవిధంగా.. రేవంత్ కూడా కాంగ్రెస్ హైక‌మాండ్ ఆశీస్సుల‌తో టీడీపీ నుంచి వ‌చ్చి.. కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టారు.

జూనియ‌ర్ అయినప్ప‌టికీ ఆయ‌న మీద ఉన్న న‌మ్మ‌కం.. మీద ప‌ద‌వి ఇచ్చారు. ప్ర‌స్తుతం స‌ర్దుకుని పోయి.. కాంగ్రెస్‌లో ఉండి ప‌నిచేస్తే.. జ‌గ్గారెడ్డికి మాలే జ‌రుగుతుంద‌ని కొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు. మ‌రి జ‌గ్గారెడ్డి ఏంచేస్తారో చూడాలి.