Begin typing your search above and press return to search.

య‌న‌మ‌లా... పిల‌వ‌డ‌మంటే ఇదేనా?

By:  Tupaki Desk   |   5 March 2017 4:57 AM GMT
య‌న‌మ‌లా... పిల‌వ‌డ‌మంటే ఇదేనా?
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొత్త‌గా త‌యారైన శాస‌న స‌భా స‌యుదాయం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి హోదాలో టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చెప్పిన మాట‌లు గుర్తున్నాయా? రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమానికి సంబంధించిన చ‌ట్టాల‌ను చేసే అసెంబ్లీ భ‌వ‌నం ప్రారంభోత్సవానికి విప‌క్ష నేతతో పాటు విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజ‌రై ఉంటే.. ఎంతో బాగుండేద‌ని ఆయ‌న చెప్పారు. అంతేనా తామైతే విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా ఆహ్వానాలు పంపామ‌ని, అయితే వారెందుకు రాలేదో త‌మ‌కు తెలియ‌ద‌ని త‌న‌దైన శైలిలో మాట్లాడారు. ఆ త‌ర్వాత మైకందుకున్న సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఇదే త‌ర‌హాలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆహ్వానాలు పంపినా విప‌క్ష పార్టీ స‌భ్యులు రాక‌పోవ‌డం త‌మకు అర్థం కావ‌డం లేద‌న్న ఆయ‌న‌... అయినా ఏదైనా అభివృద్ధిని అడ్డుకునే విష‌యంలో ముందుండే విప‌క్షం... ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ఎలా వ‌స్తారులే అంటూ సెటైరిక్‌ గానూ మాట్లాడిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయితే త‌మ‌ను ఎవ‌రూ ఆహ్వానించ‌లేద‌ని విప‌క్ష పార్టీ వైసీపీ కీల‌క నేత‌ - ఆ పార్టీ సీనియ‌ర్ ఎమ్మెల్యే పెద్ద‌రెడ్డి రామ‌చంద్రారెడ్డి అదే రోజున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆహ్వానాలు పంప‌కున్నా... కనీసం త‌మ సెల్‌ పోన్ల‌కు మెసేజ్ పెట్టినా... ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ఉండేవార‌మ‌ని ఆయ‌న బాబు స‌ర్కారు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఇదంతా గ‌తించిన ఎపిసోడ్ అనుకుంటే... నిన్న వెల‌గ‌పూడి సాక్షిగానే అసెంబ్లీ ప్రివిలేజ్‌ క‌మిటీ భేటీ జ‌రిగింది. టీడీపీ ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన ఈ క‌మిటీలో అధికార పార్టీ స‌భ్యుల‌తో పాటు విప‌క్ష ఎమ్మెల్యే హోదాలో పెద్దిరెడ్ది కూడా స‌భ్యుడే. బెజ‌వాడ‌లో వెలుగు చూసిన కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై అసెంబ్లీలో నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ గ‌డువు పూర్తి అవ‌డంతో రేపు ప్రారంభం కానున్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు రోజా హాజరుకావాల్సి ఉంది. ఈ వ్య‌వహారంపై చ‌ర్చించేందుకే ప్రివిలేజ్ క‌మిటీ నిన్న కొత్త అసెంబ్లీలోనే ప్ర‌త్యేకంగా బేటీ అయ్యింది. కీల‌క అంశాలపై చ‌ర్చించే స‌మ‌యంలో క‌మిటీలో స‌భ్యులంద‌రినీ పిల‌వాల్సిన అవస‌రం ఉంది.

అయితే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు మాత్రం క‌మిటీలోని త‌న పార్టీ స‌భ్యులంద‌రికీ ముందుగానే స‌మాచారం చేర‌వేసి... విపక్షానికి చెందిన పెద్దిరెడ్డికి మాత్రం చాలా ఆల‌స్యంగా ఉద‌యం స‌మావేశం ఉంద‌న‌గా... ఆ ముందు రోజు అది కూడా సాయంత్రం పూట స‌మాచారం ఇచ్చార‌ట‌. ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో క‌మిటీ సమావేశం ఎలా పెడ‌తారంటూ ప్ర‌శ్నించిన పెద్దిరెడ్డి... అమ‌రావ‌తికి వ‌చ్చేందుకు త‌న‌కు స‌మ‌యం స‌రిపోద‌ని, మీరే కానిచ్చేయండ‌ని చెప్పేశార‌ట‌. పెద్దిరెడ్డి నోట నుంచి అలాంటి స‌మాధానాన్ని ఆశించే చివ‌రి నిమిషంలో స‌మాచారం పంపారన్న వాద‌న వైసీపీ నుంచి వినిపిస్తోంది. కీల‌క కార్య‌క్ర‌మాలు, క‌మిటీ స‌మావేశాలు ఉన్న‌ప్పుడు స‌భ్యులంద‌రికీ స‌కాలంలో స‌మాచారం చేర‌వేయ‌కుండా... ఇలా చివ‌రి నిమిషంలో మెసేజ్ ఇచ్చి... తాము వ‌ద్దనుకున్న స‌భ్యుల నోటి నుంచే మేం రాలేమంటూ స‌మాధానం రాబ‌ట్టడం ఒక్క టీడీపీ స‌ర్కారుకే చెల్లింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుత‌న్నాయి. మ‌రి దీనికి బాబు స‌ర్కారు నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/