Begin typing your search above and press return to search.

యోగి రాజ్యంలో ఇలానా? అంబులెన్స్ రావటానికి 2 గంటలు లేటు.. ప్రముఖుడి కన్నుమూత

By:  Tupaki Desk   |   13 April 2021 9:20 AM IST
యోగి రాజ్యంలో ఇలానా? అంబులెన్స్ రావటానికి 2 గంటలు లేటు.. ప్రముఖుడి కన్నుమూత
X
అతను సాదాసీదా వ్యక్తి కాదు. లైట్ తీసుకునేంత సామాన్యుడు కూడా కాదు. కొన్ని లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచచే పద్మశ్రీ పురస్కార గ్రహీత. అన్నింటికి మించి ప్రముఖ చరిత్రకారుడన్న ట్యాగ్ ఆయన సొంతం. అన్ని ఉన్నా.. ఆయన మరణం మాత్రం అయ్యో అనిపించేలా.. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపంగా నిలిచింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. పోలోమని వచ్చేసి.. తెగ ప్రచారం చేసే యూపీ సీఎం యోగి ఏలుబడిలో ఉన్న చోటే..అనారోగ్యానికి గురైన ఒక ప్రముఖుడిని ఆసుపత్రికి తరలించే విషయంలో చోటుచేసుకున్న ఆలస్యం.. అతడి ప్రాణాలు పోయేలా చేసింది.

అది కూడా యూపీలోని ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నారని అనుకున్నా.. అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర రాజధాని లక్నోలో నివాసం ఉండే.. యోగేష్ ప్రవీణ్ అనే ప్రముఖ చరిత్రకారుడు.. తాజాగా అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన జ్వరం.. ఊపిరి తీసుకోలేకపోవటం లాంటి ఇబ్బందులు తలెత్తటంతో ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సు కోసం ఫోన్ చేశారు.

రెండు గంటలు గడిచినా.. రావాల్సిన అంబులెన్సు రాలేదు. దీంతో.. విసిగిపోయిన కుటుంబ సభ్యులు.. ప్రైవేటు వాహనంలో ఆయన్ను బలరామ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన్నుపరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మరణించారని చెప్పారు. యోగేష్ ప్రవీణ్ మృతికి పలువురు నేతలు.. ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. బతికి ఉన్నప్పుడు ఇదే నేతలు తమ ఏలుబడిలో వ్యవస్థను సరిగా సెట్ చేసి ఉంటే.. ఈ ప్రముఖుడు మరికొంత కాలం బతికి ఉండేవాడేమో?