Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులకు చివరి అవకాశం ... క్షమాభిక్ష పిటిషన్ కి వారం గడువు !

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:29 AM GMT
నిర్భయ దోషులకు చివరి అవకాశం ... క్షమాభిక్ష పిటిషన్ కి వారం గడువు !
X
దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు పై విచారణ ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికే నిర్భయ పై దారుణానికి ఒడిగట్టినవారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ..మరొకరిని బాల నేరస్థుల క్రింద శిక్ష వేసి ..ఈ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విషయంలో రోజుకో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు నోటీసులు పంపించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తీహార్ జైలు పాలన విభాగం సూచించింది.

ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ పేర్కొన్నారు. ఈ గడువు లోపు క్షమాభిక్ష కు దాఖలు చేసుకోకపోతే.. తదుపరి చర్యలకు కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా.. బుధవారం అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్‌ ను వెంటనే విడుదల చేస్తుంది అని అందరూ భావించారు.

కానీ , మరోసారి ఉరి శిక్ష అమలు చేయటంపై తీర్పును ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. అలాగే మరణ శిక్ష అమలు ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. అయితే, డిసెంబర్ 16వ తేదీనే నిర్భయ దోషులకు ఉరి పడుతుందని, సోషల్ మీడియా లో వార్తలు ఫుల్‌ గా వైరల్ అయ్యాయి. కానీ , అది జరగలేదు. చూడాలి మరి ఈ నలుగురికి జనవరి 7 న అయిన కోర్టు ఉరి శిక్ష అమలు తుది తీర్పుని వెల్లడిస్తుందో లేదో ...