Begin typing your search above and press return to search.

నాటో దేశాలు వణికిపోతున్నాయా ?

By:  Tupaki Desk   |   22 March 2022 5:32 AM GMT
నాటో దేశాలు వణికిపోతున్నాయా ?
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కాదు కానీ నాటో దేశాల్లో వణుకు మొదలైందట. యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఏరోజుకారోజు యుద్ధం ఆగిపోతుందని అనుకోవటమే కానీ రోజు రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతోంది. ఉక్రెయిన్ పై రష్యా సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత నాటో దేశాల్లో వణికిపోతున్నాయి. ఎందుకంటే సడెన్ గా రష్యా అణ్వాయుధాలను బయటకు తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుమానిస్తున్నాయట.

ఇప్పటికే ఉక్రెయిన్ పైన బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా సరిహద్దుల్లోనే ఉన్న పోలండ్ పైన కూడా బాంబులు కురిపిస్తోంది. పనిలోపనిగా రేపటి రోజున బాంబులతో తమ భూభాగాన్ని టార్గెట్ చేసిన ఆశ్చర్యంలేదని పోలండ్ భావిస్తోంది. అందుకనే పోలండ్ కూడా తన ఆయుధాలను, క్షిపణులను రెడీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ కూడా అణ్యాయుధాలను రెడీ చేసుకుంటోంది.

ట్రైడెంట్ ఖండాతరాలకు ప్రయోగించే అణు క్షిపణుల వార్ హెడ్లను బ్రిటన్ రెడీ చేసుకుంటోంది. యూకేలోని అల్మెర్మస్టోన్ లోని ఆటామిక్ వెపన్స్ ఎస్టాబ్లిష్మెంట్ డిపో నుండి ఆరు భారీ వాహనాల్లో అణువార్ హెడ్లను తరలించింది. రాయలనేవీ ఆయుధ డిపోకు ఈ వార్ హెడ్లను తరలించింది బ్రిటన్. క్షిపణులకు వార్ హెడ్లను బిగించి సబ్ మెరైన్ల నుండి కూడా ప్రయోగించే అవకాశముంది. అందుకనే అన్నింటినీ బ్రిటన్ రెడీచేస్తోంది. హఠాత్తగా అణు వార్ హెడ్లను బ్రిటన్ ఎందుకు రెడీచేస్తోందనేది పెద్ద ప్రశ్నగా తయారైంది.

మొత్తం మీద నాటో దేశాలను రష్యా వణికించేస్తోంది. ఏ నిముషంలో రష్యా ఎలాంటి ఆయుధాలను వాడుతుందో అర్ధం కాక నాటో దేశాలన్నీ బాగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకనే ముందు జాగ్రత్తగా అన్నీ దేశాలు తమ ఆయుధాలను రెడీ చేసుకుంటున్నాయి. పోలండ్ అయితే ఇప్పటికే సరిహద్దుల్లోకి అన్నీరకాల ఆయుధాలను తరలించింది. చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన దుస్సాహసం ఎంత పని చేసిందో అందరికీ అర్ధమవుతోంది. చివరకు ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో ఏమో చూడాల్సిందే.