Begin typing your search above and press return to search.

కవిత వెంట ప్రగతి భవన్ కు వెళ్లేందుకు నేతల తహతహ

By:  Tupaki Desk   |   13 Oct 2020 2:40 PM IST
కవిత వెంట ప్రగతి భవన్ కు వెళ్లేందుకు నేతల తహతహ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నమన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర మంత్రులకు సైతం సీఎం కేసీఆర్ దర్శనం అరుదుగా లభిస్తుంటుంది. ఆ లెక్కన ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల మాటేమిటన్న ప్రశ్నే అక్కర్లేదు. వారికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం అరుదుగా లభిస్తుంటుంది.

ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్ లోకి వెళ్లే అవకాశం చాలా తక్కువ. ఇలాంటివేళ.. ప్రగతిభవన్ కు వెళ్లే అవకాశం.. ఎలాంటి పరిమితులు.. ముందస్తు అపాయింట్ మెంట్ అక్కర్లేకుండా.. నేరుగా ప్రగతిభవన్ లోకి వెళ్లే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? తాజాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కవిత.. ప్రగతిభవన్ కు బయలుదేరారు.

ఆమె వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి మొదలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు కవిత వెంట హైదరాబాద్ కు బయలుదేరారు. ఘన విజయం అనంతరం.. తాను ఎన్నికైనట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న ఆమె తన ఇంటికి మొదట వెళ్లి.. తర్వాత హైదరాబాద్ కు బయలుదేరారు. ముఖ్యమంత్రి కుమార్తె కావటంతో ఆమెతో పాటు హైదరాబాద్ కు భారీగా నేతలు బయలుదేరారు. కవిత గెలుపును తమ ఖాతాలో వేసుకునేందుకు తహతహలాడిన గులాబీ నేతలు.. ప్రగతిభవన్ లోకి వెళ్లే అకాశాన్ని మిస్ చేసుకోలేదు. అందుకే.. కవితతో పాటు భారీగా నేతలు ప్రగతి భవన్ కు వెళ్లటమే కాదు..సీఎం కేసీఆర్ ను కలిసి.. కవితమ్మ గెలుపులో తమ పాత్ర ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారట అధినేత మనసును దోచుకోవాలని ఎవరికి ఉండదు. అలాంటి అరుదైన అవకాశాల్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి?