Begin typing your search above and press return to search.
రాష్ట్రంలో వందేళ్ళ తర్వాత భూ సర్వే
By: Tupaki Desk | 23 Oct 2020 9:15 AM ISTభూ సరిహద్దులు...ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. రెవిన్యూ భూములు, మున్సిపల్ భూములు, గ్రామ కంఠాలు, పోరంబోకు, ప్రైవేటు భూములు ఇలా చాలా రకాలే ఉంటాయి. అందుకనే భూ వివాదాలు ఎప్పటకప్పుడు పెరిగిపోతుంటాయి. అందుకనే భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశాలు లేకుండా చూడటం కోసం ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేయించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. వందేళ్ళ తర్వాత పక్కగా సమగ్ర భూ సర్వే చేయించబోతున్నట్లు తెలిపారు.
భూ సర్వేని పక్కగా చేయించటం కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 675 మండలాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని ఏకకాలంటో సర్వే చేయబోతున్నట్లు చెప్పారు. రాబోయే జనవరి 1వ తేదీన మొత్తం రాష్ట్రంలో ఒకేసారి సర్వే ప్రక్రియ మొదలుపెట్టాలని జగన్ ఆదేశించారు. సర్వే పూర్తి చేయటానికి రెండు సంవత్సరాల గడువు ఇచ్చారు. గతంలో రిజిస్ట్రేషన్ కాగితాలు ట్యాంపర్ జరిగిన విషయాలను సిఎం ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. ఇటువంటి ట్యాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడబోతున్నట్లు చెప్పారు.
పెద్ద ఎత్తున సర్వే యజ్ఞాన్ని మొదలుపెట్టబోతున్న కారణంగా అవసరమైన సర్వేయర్లు కూడా అందుబాటులో ఉండాల్సిందే అంటూ ఆదేశించారు. కృష్ణాజిల్లాలోని తక్కెళ్ళపాటు, రామచంద్రునిపేటలో జరిగిన ట్రయల్ సర్వే సక్సెస్ అయిన విషయాన్ని ప్రస్తావించిన సిఎం ఆ ఫీడ్ బ్యాక్ ను ఉన్నతాధికారులకు వివరించారు. ప్రతి మండలంలోను మూడు బృందాలు పనిచేయాలన్నారు. ఇందుకోసం మొత్తం 4500 బృందాలను నియమించినట్లు కూడా చెప్పారు. సర్వే పక్కాగా జరగటం కోసం శాటిలైట్ ఇమేజీలతో పాటు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు చెప్పారు.
సమగ్ర సర్వే కోసం 70 బేస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ వివరించారు. ఒకసారి సర్వే పూర్తయిపోతే తర్వాత జరిగే రిజిస్ట్రేషన్లన్నింటినీ గ్రామ సచివాలయాల్లోనే చేస్తామన్నారు. తొందరలో ఏర్పాటు చేయబోయే విలేజ్ కోర్టుల్లో భూ వివాదాలకు సంబందించిన పరిష్కారాలు అందించాలన్న తన ఆలోచనను జగన్ ఉన్నతాధికారులతో షేర్ చేసుకున్నారు. మరి విలేజ్ కోర్టులంటే జగన్ దృష్టిలో ఏమిటో తెలీదు కానీ ఈ విషయమై మళ్ళీ ఎవరైనా కోర్టుకెక్కే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. సరే భూ సర్వే విషయంలో జగన్ ఆలోచన గనుక పక్కాగా అమలైతే భూ వివాదాలు దాదాపు ఉండవనే అనుకోవాలి. మండలాలతో పాటు మున్సిపాలిటిల్లో కూడా సర్వే జరిపేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు చెప్పారు సిఎం.