Begin typing your search above and press return to search.
200 కోట్ల భూమికి టీఆర్ఎస్ నేత ఎసరు!?
By: Tupaki Desk | 4 Feb 2020 11:27 AM ISTవడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్న ముక్క దొరుకుతుందనేది నానుడి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున.. ఉస్మానియా యూనివర్సిటికీ చెందిన నాలుగు ఎకరాల భూమి.. బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల విలువైన భూమి కబ్జా అవుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ , రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్న వైనం విస్తుగొలుపుతోంది.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త ఈ 200 కోట్ల భూమిని కబ్జా చేసేస్తున్నారు. ఈయన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి సన్నిహితుడు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వర్సిటీ విసీ సహా, రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు.
ఉస్మానియా వర్సిటీ కోసం నాడు నిజాం రాజు ప్రస్తుత మణికేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన భూములను రూ.2కు ఎకరం చొప్పున నాడు హిమ్మత్ అలీఖాన్ అనే వ్యక్తి నుంచి కొన్నాడు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గులాబీ కార్పొరేటర్ హిమ్మత్ అలీఖాన్ వారసుల నుంచి తాను కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేయడం విశేషం.
వర్సిటీకి చెందిన విలువైన 200 కోట్ల భూమి కబ్జా అవుతున్న ఉస్మానియా వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా వర్సిటీ భూమిని కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నా వీరు పట్టించుకోలేదు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీతో మిలాకత్ అయ్యే ఇదంతా కలిసి కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తున్నారా అన్న విమర్శలను విద్యార్థి సంఘాల నేతలు చేస్తున్నారు.