Begin typing your search above and press return to search.
రీల్ కాదు రియల్: నాడు ఉగ్రవాది.. నేడు వీర జవాన్!
By: Tupaki Desk | 25 Jan 2019 11:53 AM ISTఒక విలన్. తర్వాత హీరో అవుతాడు. ఇలాంటి సినిమాలు చాలానే చూసి ఉంటారు. విలన్ గా అందరి చేత అసహ్యించుకున్నోడు.. ఆ తర్వాత హీరోగా మారి ఎంతోమంది మనసుల్ని దోచుకోవటం రీల్ లో ఓకే కానీ రియల్ గా సాధ్యం కాదనుకుంటే తప్పులో కాలేసినట్లే. అలాంటి రియల్ కథ ఇప్పుడు చెప్పబోతున్నాం.
లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీ జమ్ముకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలోని చెకి అమ్మజీ పట్టణానికి చెందిన వ్యక్తి. ఉగ్రవాద కార్యకలాపాలకు అకర్షితుడైన అతడు ఉగ్రవాదుల్లో చేరాడు.
తర్వాతి కాలంలో మనసు మార్చుకొని భద్రతా దళాలకు లొంగిపోయాడు. ఆ తర్వాత అతడు భారత సైన్యంలో చేరాడు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులని ఏరివేసే క్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నాడు. పలు ఆపరేషన్లో పాల్గొని దేశ సేవ చేశాడు. ముష్కరులతో పోరాడుతూ తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఇతగాడి స్ఫూర్తికి దేశ అత్యున్నత సాహస పురస్కారం అశోక్ చక్రను మోడీ సర్కారు ప్రకటించింది.
రిపబ్లిక్ డే వేళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లాన్స్ నాయక్ కుటుంబానికి అందజేయనున్నారు. తాజాగా ప్రకటించిన పురస్కారంతో ఈ రీల్ కాని రియల్ స్టోరీ బయటకు వచ్చింది. 2004లో భారత సైన్యంలోని 162వ ఇన్ ఫ్యాంట్రీ బెటాలియన్ లో చేరిన ఆయన.. దక్షిణ కశ్మీర్ లోని ఉగ్రవాదులపై చేపట్టిన అనేక ఎన్ కౌంటర్లలో పాల్గొన్నాడు. ఉగ్రవాదుల్ని ఏరివేసే పోరాటంలో అతను చూపించిన ధైర్యసాహసాలకు రెండుసార్లు సేవా పతకం లభించింది.
ఉగ్రవాదుల్ని ఏరివేసే ఒక ఆపరేషన్లో పాల్గొన్న లాన్స్ నాయక్.. తనకు తూటాలు తగులుతున్నా పట్టించుకోకుండా ప్రత్యర్థుల్ని హతమార్చేందుకు ప్రయత్నం చేస్తూ.. ప్రాణత్యాగం చేశాడు. అతడి పోరాటానికి.. త్యాగానికి గుర్తుగా అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తన భర్త మరణించిన విషయం తెలిసిన నాటి నుంచి తన కంటి నుంచి నీరు జారలేదని మహజబీన్ చెప్పారు. తనలో అంతర్గతంగా గూడు కట్టుకున్న పట్టుదల తన కన్నీటిని అడ్డుకుందని ఆమె చెబుతారు. తన భర్త తనకు స్ఫూర్తిదాత అని.. ఉపాధ్యాయురాలిగా తన రాష్ట్రంలోని పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని చెబుతారు. యువతను సరైన దారిలో నడిపించటమే తన లక్ష్యమని చెబుతారు. 15 ఏళ్ల క్రితం తన భర్తను చూసిన తొలి చూపులోనే ఆయన ప్రేమలో పడినట్లు ఆమె చెబుతారు.