Begin typing your search above and press return to search.
చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 Sept 2020 11:01 PM ISTతిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ ను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
డిక్లరేషన్ పేరుతో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రభుత్వంపై, సీఎం జగన్ పై బురద జల్లుతున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లంతా పనిపాట లేనివాళ్లని నిప్పులు చెరిగారు. ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
గతంలో చెన్నారెడ్డిని సీఎం సీటు నుంచి కిందకు దించేందుకు కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో మత ఘర్షణలు సృష్టించిందని 1989-94 మధ్యలో మత ఘర్షణలు జరిగాయని కాంగ్రెస్ కల్చర్ అది అని లక్ష్మీపార్వతి విమర్శించారు. అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు ఏపీలో మత ఘర్షణలకు కారణమవుతున్నాడని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. టీడీపీ నేతలులాగానే.. బీజేపీ నేతలు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు.
నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం భువనేశ్వరి క్షుద్రపూజలు చేసిందంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని.. జగన్ తిరుమల వెళితేనే ఎందుకు అడుగుతున్నారని మండిపడ్డారు. కొందరు స్వామీజీలు కాషాయం ధరించి మరీ రాజకీయాలు చేస్తున్నారని పరిపూర్ణానందపై లక్ష్మీపార్వతి కౌంటర్ ఇచ్చారు.