Begin typing your search above and press return to search.

త్వరలోనే లోకేష్ బండారం బయటకొస్తుంది

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:11 PM IST
త్వరలోనే లోకేష్ బండారం బయటకొస్తుంది
X
వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మిపార్వతి ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబ పరువు మరోసారి పోయిందని.. నందమూరి కుటుంబాన్ని బాబు మోసం చేశాడని ఆరోపించారు. కూకట్ పల్లిలో ఓడిపోతామని తెలిసే సుహాసినిని చంద్రబాబు నిలబెట్టారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో తెలంగాణ ప్రజలను కొనాలని బాబు చూశాడని.. కానీ ఓటర్లు మాత్రం దిమ్మదిరిగేలా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.

ఏపీలో కూడా తెలంగాణ ఫలితాలే పునరావృతమవుతాయని.. ఆంధ్రప్రదేశ్ లో బాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఇటీవలే చంద్రబాబు అవినీతిపై విస్తుగొలిపే నిజాలు చెప్పాడని.. టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందన్నారు. సీఎం రమేష్ - సుజనాచౌదరిల బాగోతం బయటపడుతోందన్నారు. త్వరలోనే లోకేష్ బాబు బండారం వెలుగులోకి వస్తుందని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.