Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది : లక్ష్మి పార్వతి !

By:  Tupaki Desk   |   18 Jan 2020 1:51 PM IST
ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది : లక్ష్మి పార్వతి !
X
ఆంధ్రుల ఆరాధ్య దైవం - ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - దివంగత నేత - నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 24వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకి . కుటుంబ సభ్యులు నివాళ్లు అర్పించారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించిన కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి - కాసేపు అక్కడే కూర్చున్నారు. ఇక అయన వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని లక్ష్మీ పార్వతి తెలిపారు. తెలుగు జాతికి ఇదో దుర్దినమైన రోజని.. ఎన్నో గుండెలు ఈరోజు ఆగిపోయాయని ఆవిడ అన్నారు. అన్యాయంగా కొంతమంది ఎన్టీఆర్‌ ని అధికారం నుంచి తొలగించి - ఆయన చనిపోవడానికి కారణమయ్యారని తెలిపారు. చివరినిమిషాల్లో ఎన్టీఆర్ పడ్డ బాధ - ఆవేదన నాకు ఒక్క దానికి మాత్రమే తెలుసు అని అన్నారు. కాగా.. ఎన్టీఆర్‌ మహిళలను ఎంతగానో గౌరవించేవారని - కానీ ఈరోజుల్లో మహిళలకు అసలు గౌరవం దక్కడంలేదని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసారు.