Begin typing your search above and press return to search.

బసవతారంపై లక్ష్మీపార్వతి ఆసక్తికర కామెంట్స్‌

By:  Tupaki Desk   |   20 Jan 2019 12:42 PM IST
బసవతారంపై లక్ష్మీపార్వతి ఆసక్తికర కామెంట్స్‌
X
ఎప్పుడు లేనంతగా ఈమద్య కాలంలో నందమూరి తారక రామారావు గారి గురించి చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ చిత్రం నేపథ్యంలో లక్ష్మీ పార్వతి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్టీఆర్‌ కు సంబంధించిన వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్‌ లో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి. లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసవతారకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బసవతారకం గారంటే అమితమైన గౌరవం అని, ఆమెను తాను దేవతలా పూజిస్తానంటూ చెప్పుకొచ్చింది.

తన పూజ గదిలో ఇప్పటికి కూడా ఆమె ఫొటో ఉంది. గత 28 సంవత్సరాలుగా నేను ఆమెను దైవ సమానురాలుగా పూజిస్తున్నాను. ఆమె గొప్ప ఇల్లాలు. బయటి విషయాలు తెలియకున్నా ఇంటిని చక్క దిద్దిన మహా ఇల్లాలు ఆమె. ఆమెకు ఎన్టీఆర్‌ గారు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆమె బతికి ఉన్న సమయంలో చాలా గౌరవంగా చూసుకునేవారని, ఆమె మాటకు తాను చాలా విలువ ఇచ్చేవాడినంటూ నాకు ఎన్టీఆర్‌ గారు పలు సందర్బాల్లో చెప్పారు. ఒక్క రాజకీయ విషయాల్లో తప్ప బసవతారకం గారు ప్రతి విషయంలో కూడా ఎన్టీఆర్‌ గారికి పూర్తి మద్దతుగా నిలిచారట.

కుటుంబ భాద్యతలను పూర్తిగా తనపై వేసుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఎన్టీఆర్‌ గారు ఆమెను ఇష్టపడి చేసుకున్నారు. ఆమె ఎన్టీఆర్‌ గారికి మరదలు, ఆమెకు చాలా ప్రాముఖ్యత ఇచ్చానని ఎన్టీఆర్‌ గారు నాతో చెప్పారు. ఆమెకు ఇచ్చిన స్థానాన్ని నాకు ఇచ్చారు. అందుకే అక్క వేసుకున్న మంగళ సూత్రాలు మరియు అక్క వేసుకున్న గాజులు నాకు ఇచ్చారు. ప్రస్తుతం చేతికి ఉన్న గాజులు కూడా అక్క అప్పట్లో వేసుకున్నవే అంటూ లక్ష్మీ పార్వతి అన్నారు. తాను ఎప్పటికి బసవతారకం గారిని దైవ సమానురాలుగానే చూస్తానంటూ చెప్పుకొచ్చింది.