Begin typing your search above and press return to search.

100 కోట్ల తో లక్ష బంగారు ఉంగరాలు... ఆ ఒక్క సీటు కోసం ఇదేంటి స్వామి !

By:  Tupaki Desk   |   26 Nov 2019 5:16 AM GMT
100 కోట్ల తో లక్ష బంగారు ఉంగరాలు... ఆ ఒక్క సీటు కోసం ఇదేంటి స్వామి !
X
ఈ మధ్య కాలం లో కోట్లు అంటే అందరూ రోజు ఆఫీసులకి వేసుకొని పోయే కోట్లలా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకి డబ్బులు అంటే నీళ్లలాగా అయి పోయింది. పదవి వస్తే మళ్లీ అంతకంతకు సంపాదించుకోవచ్చు అనే రాజకీయ కోణంలో అలోచించి .. ఎన్నికల కోసం ఎన్ని వందల కోట్లనైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. ఒక్కో ఓటు కి 10 వేలకి పైగా కూడా కొన్ని ఇస్తున్నారు. గెలుపే లక్ష్యం గా బరిలోకి బాగా వ్యాపార వేత్తలు ఎంతకైనా సిద్ద పడుతున్నారు.

ఇక పోతే మరికొద్ది రోజుల్లో కర్ణాటక లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు వందల కోట్ల ఆస్తులు ఉన్న వారే. దీనితో ఎవరికీ ఎవరు తగ్గడంలేదు. ఇక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆస్తి రూ. 1,200 కోట్లకు పైగానే ఉంది. ఈ డబ్బు బలంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల తో హోస్ కోటే నియోజక వర్గం ఓటర్ల కు 100 కోట్లు ఖర్చు చేసి లక్షకు పైగా బంగారు ఉంగరాలు పంచి పెట్టడానికి సర్వం సిద్దం చేశారని ప్రచారం జరగుతోంది. బంగారం తో పాటుగా ఓటర్ల ని ఆకట్టుకోవడనికి రకరకాలైన గిఫ్ట్స్ ని రెడీ చేసి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

హోస్ కోటే పట్టణం తో సహ ఆ నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఓ బంగారు ఉంగరం పంచి పెట్టాలని ఎంటీబీ నాగరాజ్ నిర్ణయించారని సమాచారం. దేవుడి ముఖం ఉన్న ఐదు గ్రాముల బంగారు ఉంగరాలు ఇప్పటికే ఎంటీబీ నాగరాజ్ తయారు చేయించారని సమాచారం.హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంటీబీ నాగరాజ్ ఆస్తి రూ. 1,200 కోట్లకు పైగా ఉంది. అంత ఆస్తి ఉన్న ఎంటీబీ నాగరాజ్ ప్రతి ఇంటికి ఓ బంగారు ఉంగరం పంచిపెట్టడం పెద్ద లెక్కలోకి రాదని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. దీనితో ఆ నియోజకవర్గం పై ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.