Begin typing your search above and press return to search.

18 ల‌క్ష‌ల ఆధార్ కార్డులను రద్దు...

By:  Tupaki Desk   |   15 Aug 2017 6:20 AM GMT
18 ల‌క్ష‌ల ఆధార్ కార్డులను రద్దు...
X
స‌మ‌స్తం ఆధార్ మ‌యం అయిపోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం షాకింగ్ లాంటి వార్త ఒక‌టి వెలువ‌రించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇప్పటివరకు దాదాపు 81 లక్షల ఆధార్ కార్డుల గుర్తింపును రద్దు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ - ఐటీ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఈ విషయాన్ని రాజ్యసభకు తెలిపారు. ఆధార్ 12 అంకెలతో కూడిన విశిష్ట‌ గుర్తింపు నంబరు. ఇప్పటివరకు దేశంలో 115 కోట్ల మందికి ఆధార్ కార్డుల జారీ పూర్తయింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం - గ్యాస్ సబ్సిడీ వంటి పలు కార్యక్రమాలతోపాటు ఈ ఏడాది నుంచి పన్ను రిటర్నుల దాఖలుకు కూడా ఆధార్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసిన నేపథ్యంలో ఆధార్ ప్రాజెక్టుకు చెందిన పోర్టల్ www.uidai.gov.in లోకి లాగినై మీ కార్డు పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌లోని హోమ్‌పేజీలో కుడివైపు కన్పించే వెరిఫై ఆధార్ నంబర్ లింక్‌ను క్లిక్ చేయాలి. తద్వారా ఓపెన్ అయ్యే పేజీలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా కార్డు పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

మ‌రోవైపు కొత్త పరోక్ష పన్నుల చట్టం జీఎస్టీకి సంబంధించి విధానపరంగా సర్వోన్నత నిర్ణయాధికార మండలి జీఎస్టీ మండలికి అభ్యర్థనల వరద పోటెత్తుతున్నది. హెల్మెట్లు - గ్రానైట్ శ్లాబులు - హైబ్రిడ్ కార్లు - నమ్‌ కీన్.. ఇలా పలు రంగాల వ్యాపారులు తమ ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని మండలిని వేడుకుంటున్నారు. ఇప్పటివరకు జీఎస్టీ కౌన్సిల్‌కు 133 రకాల ఉత్పత్తులపై పన్నురేటును తగ్గించాలని సంబంధిత వర్గాల నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థనలు అందాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త పరోక్ష పన్నుల చట్టం అమలులోకి వచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ 1,200 రకాల వస్తువులను నాలుగు పన్ను శ్లాబుల్లో (5 - 12 - 18 - 28 శాతం) చేర్చింది. అయితే, కొంతమంది ప్రస్తుతం వర్తించే పన్నురేటుపై సంతృప్తిగా లేరని, భారాన్ని తగ్గించాలని వారు కోరుతున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.