Begin typing your search above and press return to search.

లఖింపూర్ ఖేరి హింసాకాండ : రైతులకి రూ45లక్షలు .. బీజేపీ నేతలకూ రూ.50లక్షలు

By:  Tupaki Desk   |   4 Oct 2021 2:30 PM GMT
లఖింపూర్ ఖేరి  హింసాకాండ : రైతులకి రూ45లక్షలు .. బీజేపీ నేతలకూ రూ.50లక్షలు
X
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మరణించిన రైతుల కుటుంబాలకు రూ .45 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు రూ .45 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు, గాయపడిన వారికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లఖింపూర్ ఖేరీ హింస ఘటనలో బాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది. యుపి పోలీసు ఎడిజి (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ సోమవారం మాట్లాడుతూ, లఖింపూర్ ఖేరిలో హింసాకాండలో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ .45 లక్షలు ఇవ్వనుందని , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనుందని గాయపడిన వారికి రూ. 10 లక్షలు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేస్తామని చెప్పారు.

ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, సిఆర్పిసి సెక్షన్ 144 అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు జిల్లా పర్యటనకు అనుమతించబడలేదని చెప్పారు. అయితే, రైతు సంఘాల సభ్యులు ఇక్కడికి రావడానికి అనుమతించబడ్డారు. లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనలో హింస చెలరేగడంతో ఆదివారం ఎనిమిది మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు కారణమైంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యుపి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య లు బన్బీర్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో, మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలియజేయడానికి భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన పలువురు రైతులు నల్లజెండాలతో వెళ్లారు.

టికోనియా బన్బీర్ పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న రైతులకు మీదికి కాన్వాయ్ లోని ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు రైతుల పై దూసుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత రైతులు ఆగ్రహంతో అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. నలుగురు రైతులు మరణించిన ఘటన తర్వాత జరిగిన ఘర్షణలో మరో నలుగురు మరణించారు. ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు కూడా మరణించారు.

దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం రాజీనామా చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇలా అన్ని విపక్షాలు రోడ్లపై నిరసనలకు దిగాయి. లఖింపూర్ జిల్లా అంతటా 144 సెక్షన్ విధించి పోలీసులు.. రాజకీయ నేతలను అటువైపునకు అనుమతించడంలేదు. పోస్ట్ మార్టం అనంతరం చనిపోయిన రైతుల మృతదేహాలతో వారి కుటుంబీకులు, రైతుల సంఘాల నేతలు లఖింపూర్ రోడ్లపైనే ధర్నాకు దిగారు. వారిని ఒప్పించి, అంత్యక్రియలు పూర్తి చేయించేలా ప్రభుత్వాధికారులు మంతనాలు జరుపుతున్నారు.

ఈక్రమంలోనే లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకున్న హింసలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు తలా రూ.45లక్షల నష్ట పరిహరం ప్రకటించింది. అంతేకాదు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిచేత న్యాయ విచారణ కూడా జరిపిస్తామని తెలిపిది. చనిపోయిన రైతులకు ఇచ్చినట్లే, ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తలకు కూడా రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి మిశ్రా డిమాండ్ చేశారు. యూపీలో ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతులపై హింస, అనంతర పరిణామాలపై యోగి సర్కారు అన్ని జాగ్రత్తలు తీసుకోని ముందుకి సాగుతుంది.