Begin typing your search above and press return to search.

లఖింపూర్ ఖేర్ హింసాకాండ...ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక అంశాలు !

By:  Tupaki Desk   |   10 Nov 2021 12:30 AM GMT
లఖింపూర్ ఖేర్ హింసాకాండ...ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక అంశాలు !
X
ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేర్ వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిశ్‌ మిశ్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆందోళన చేస్తున్న రైతులపై తన కాన్వాయ్‌ ను దూసుకెళ్లించిన ఆశిశ్‌ కాల్పులు కూడా జరిపినట్టు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది.

రైతులపై ఆశిశ్‌ మిశ్రా తో పాటు అతడి స్నేహితుడు అంకిత్‌ దాస్‌ కాల్పులు జరిపినట్టు FSL రిపోర్టు స్పష్టం చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను స్పాట్‌ లో లేనని చెబుతున్నారు ఆశిశ్‌ మిశ్రా, కాని FSL నివేదిక మాత్రం ఆయన స్పాట్‌ లోనే ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆశిశ్‌ మిశ్రాతో అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు. లఖీంపూర్‌ ఖేరి ఘటనలో ఆశిశ్‌ మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటన లో 8 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణను ప్రస్తుతం యూపీ సిట్‌ దర్యాప్తు చేస్తోంది. అయితే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని సుప్రీంకోర్టు సిట్‌ విచారణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐకి ఈ కేసు విచారణను అప్పగించడం ఇష్టం లేదన్న సుప్రీంకోర్టు ఇద్దరు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో విచారణకు ఆలోచిస్తునట్టు తెలిపింది.

10 రోజుల గడువు ఇచ్చినప్పటికి యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక అందలేదని, అందుకే ఇద్దరు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిలతో ఈ ఘటనపై విచారణకు ఆలోచిస్తునట్టు తెలిపారు సీజేఐ ఎన్వీరమణ. ఈ ఘటనపై నమోదైన రెండు ఎఫ్‌ ఐఆర్‌ లను కలిపి విచారించడం , ప్రధాన నిందితుడిని కాపాడేందుకే అన్న అనుమానాలు కలుగుతున్నాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీ హైకోర్టు కాకుండా పంజాబ్‌ హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌ తో లఖీంపూర్‌ ఖేరి ఘటనపై దర్యాప్తు జరిపితే బాగుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.