Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: లఖింపూర్ లో రైతులను ఇలా చంపారు..అంత్యక్రియలకు నో అన్న బాధితులు
By: Tupaki Desk | 5 Oct 2021 4:00 PM ISTదేశవ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపూర్ ఖేరి’లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైతులపైకి ఓనేత వాహనం ఎంత దురుసుగా వెళ్లింది? వారి ప్రాణాలు ఎలా తీశారో కళ్లకు కట్టినట్టు అర్థమైంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో నిరసన చేస్తున్న రైతులు తమ దారిలో తాము ముందుకు సాగుతుంటే ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి ముందుకు వెళ్లిన నేతల వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే అధికార పార్టీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో తాజాగా వీడియోతో అర్థమవుతోంది.
చుట్టూ వందల మంది ఉన్నా వాహనంతో ఢీకొడుతూ మనుషుల ప్రాణాలు తీసిన వైనం విస్తుగొలుపుతోంది. అధికారబలంతో ఓ నేత చేసిన పని ఇదీ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తన కుమారుడు ఓ కేంద్ర సహాయ మంత్రి కప్పిపుచ్చే పని చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలోని టేకునియాలో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో మరణించిన వారిలో ఇద్దరు రైతుల కుటుంబాలు మంగళవారం వారి మృతదేమాలకు పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకూ దహనం చేయడానికి నిరాకరించారు.
నచతార్ సింగ్ ఇంటికి మృతదేహం చేరుకున్నా.. వారు దహన సంస్కారాలు చేయబోమని తేల్చిచెప్పారు. కుటుంబానికి మద్దతుగా స్థానిక రైతులు నిలబడ్డారని అంటున్నారు. లవ్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల తర్వాత పోస్టుమార్టం నివేదికలను తారుమారు చేయవచ్చని ఆరోపిస్తూ ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి వారు నిరాకరించారు. కేంద్రమంత్రిపై చర్యలు తీసుకునే వరకూ దహనం చేయబోమని ఆ కుటుంబం భీష్మించింది.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పర్యటనకు నిరసనగా జరిగిన హింసాకాండలో మరణించిన 8మందిలో లవ్ ప్రీత్ సింగ్ , మరో ముగ్గురు రైతులు ఉన్నారు. ఈ ఘటనకు మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కారణమని.. ఘటన జరిగిన సమయంలో అతడే కారు నడుపుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.