Begin typing your search above and press return to search.

చైనాలో భయం... కఠిన ఆంక్షలు

By:  Tupaki Desk   |   16 March 2022 3:29 AM GMT
చైనాలో భయం... కఠిన ఆంక్షలు
X
డ్రాగన్ దేశాన్ని మళ్ళీ కరోనా మహమ్మారి వణికించేస్తోంది. స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో చైనాలో మళ్ళీ చాలా స్పీడుగా విస్తరిస్తోంది. దీని దెబ్బకు తాజాజా చైనాలోని 13 నగరాలు లాక్ డౌన్లోకి వెళ్ళిపోయాయి. 13 నగరాల్లోని దాదాపు 3 కోట్ల మంది జనాలను ఇళ్ళల్లో నుండి బయటకు రావద్దని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ప్రభుత్వం మళ్ళీ చెప్పేంతవరకు ఎవరైనా రోడ్ల మీదకు వస్తే కఠినమైన శిక్షలు తప్పవని కూడా ఆంక్షలు విధించింది.

తాజా లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, సూపర్ మార్కెట్లను మూసేశారు. నౌకాశ్రయాలను కూడా క్లోజ్ చేసేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ను కూడా నిలిపేశారు. జిలిన్, చాంగ్ చున్, షెన్ యెన్, షాంఘై, లాంగ్ ఫాంగ్ లాంటి నగరాల్లో అయితే మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను ఏర్పాటుచేసి జనాలెవరినీ ఇళ్ళల్లో నుండి బయటకు రాకుండా స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

చాలా కాలంగా డ్రాగన్ దేశంలో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నా అదేమంతా సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొద్దిరోజులుగా కేసుల ఉధృతి పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 5280 కేసులు బయటపడ్డాయి. దాంతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోయింది. లాక్ డౌన్ విధించిన 13 నగరాల్లోను ఇంటింటి సర్వేని ప్రభుత్వం మొదలుపెట్టింది. మొత్తం అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య ను ఒక్కసారిగా పెంచేసింది. ఆక్సిజన్, ఐసీయు కేంద్రాలను అవసరాలకు అనుగుణంగా పెంచటానికి రెడీగా ఉంది.

రాజధాని బీజింగ్ లో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బీజింగ్, షాంఘై నగరాల మధ్య విమాన రాకపోకలు కూడా నిలిపేశారు. ఇపుడిప్పుడు లాక్ డౌన్ ఎత్తేయటం సాధ్యమయ్యేట్లుగా లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు పెరిగిపోతుండటమే కారణమన్నారు. దక్షిణ కొరియాలో కూడా ఒమిక్రాన్ కేసులు విపరీతంగా విస్తరిస్తోంది. గడచిన వారం రోజులుగా ప్రతిరోజు 3.7 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ కొరియా కూడా వణికిపోతోంది. మంగళవారం ఒక్కరోజే కొరియాలో 300 మంది చనిపోయారు. అందుకనే యావత్ ప్రపంచం ఈ ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోం